సకల చరాచర సృష్టిలో ప్రతి ఒక్క జీవికి ప్రకృతితో విడదీయరాని బంధం ఉంది.
ఈ ప్రకృతి ద్వారా ఉద్భవించే ఆహారమే, జీవుల పోషణకు ఆధారం.
అదేవిధంగా, ఈ ప్రకృతే జీవుల ఆరోగ్యానికి కూడా సంరక్షణ మార్గమని అంటున్నారు క్లినికల్ ఫార్మాసిస్ట్ మంజు కొల్లి.
క్లినికల్ ఫార్మసీలో 14 ఏళ్లుగా పనిచేస్తున్న మంజు అపారమైన అనుభవం గడించారు.
మంజు ఆధర్యంలో కాలిఫోర్నియాలోని ఫ్రెమాంట్ ఏరియాలో ఏర్పాటు చేసిన ఆయుర్హితం ఆయుర్వేదిక్ క్లినిక్ ఈ నెల 11న నిర్వహించిన ఓపెన్ హౌస్ కి అనూహ్యమైన స్పందన లభించింది.
దాదాపు 200 మందికి పైగా ప్రజలు సేవలు వినియోగించుకున్నారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ అవధాని, టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు మాజీ డైరెక్టర్ మేడసాని మోహన్, అలామెడా కౌంటీ వాటర్ డ్రిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, జాన్ వీడ్, తదితర ప్రముఖులు హాజరయ్యారు.
ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.30 గంటలకు తెరిచి ఉంచే ఈ క్లినిక్‌లో ఆరోగ్య పరిరక్షణలో ప్రకృతి వైద్యాన్ని జోడించి ఆయుర్వేద వైద్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
మిషన్ శాన్ జోస్ నివాసులు ఉన్నతమైన ఆయుర్వేద సేవలపై సంతృప్తిని వ్యక్తం చేశారు.
ప్రస్తుతం క్లినిక్‌లో అందుతున్న సేవలు!!
పంచకర్మ విధానం ఆయుర్వేదం పై సందేహాలకి సమాధానాలు
ఆయుర్వేదం పై వ్యక్తిగత సలహాలు
ఆయుర్వేద ఆరోగ్య విధానం పై అవగాహన
మన చుట్టూ ఉన్న ప్రకృతి నిజంగా మనకు బహుమతి అంటారు మంజు.
ఇదే ఆమెను ఆయుర్వేదం వైపు ఒక మార్గాన్ని చూపించింది.
5,000 సంవత్సరాల పురాతన శాస్త్రం ఆయుర్వేదం.
ఇది ఇప్పటికీ ఎటువంటి నవీకరించబడిన సంస్కరణలు అవసరం లేకుండా చెల్లుతుంది.
మొదట్లో మంజు తన కుటుంబానికి సహాయం చేయడానికి డిప్లొమా చేయాలని భావించారు.
పూర్తి స్థాయి కెరీర్ పై దృష్టి పెట్టడానికి ఇద్దరు పిల్లల కుటుంబ బాధ్యతలు ఆమెకు ఇబ్బంది అనిపించాయి.
అయినప్పటికీ ఎంతో కష్టపడి, పూర్తి సమయం ఆయుర్వేదంపై దృష్టి పెట్టారు.
ఇది ఆమె కెరీర్‌ను మారుస్తుందని ఎప్పుడూ అనుకోలేదు.
మౌంట్ మడోన్నా ఇన్స్టిట్యూట్ నుండి మంజు ఆయుర్వేద లైఫ్‌స్టైల్ సర్టిఫికేషన్‌ను పూర్తి చేసి, ఆపై ఫ్రీమాంట్‌లోని శుభమ్ ఆయుర్వేదలో అధునాతన క్లాసికల్ ఆయుర్వేద శిక్షణను పొందడం విశేషం.
ఆమె నేషనల్ ఆయుర్వేద మెడికల్ అసోసియేషన్ నుండి సర్టిఫైడ్ ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్ సర్టిఫికెట్ కూడా అందుకున్నారు.
నేషనల్ ఆయుర్వేద వైద్య సంఘం అభివృద్ధి చేసిన ఆయుర్వేద డాక్టర్ స్థాయికి సమానం.
ఈ 5 సంవత్సరాలలో మంజు సంహితలను (ఋషులు వ్రాసిన పురాతన గ్రంథాలు) నేర్చుకోవడమే కాకుండా వివిధ పరిస్థితులు, దశలతో చికిత్సలు చేయడంలో ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు.
Comments 1