ఉన్న కేసులే దించుకోలేనంత భారం అనుకుంటే.. ఇప్పుడు ఇంకో కొత్త భారం తల మీద పడింది. CJI కి రాసిన లెటర్ పబ్లిక్ కి రిలీజ్ చేసిన మేటర్ లో కోర్ట్ ధిక్కార నేరం మీద ముందుకు వెళ్ళడానికి నా అప్రూవల్ అవసరం లేదు అని చెప్పిన అటార్నీ జనరల్ తన సమాధానాన్ని తనకు లేఖ రాసిన లాయర్ ఉపాధ్యాయకు రిప్లై ఇచ్చారు.
సీజేఐ కి జగన్ రాసిన లేఖ పై స్పందించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ జగన్ లేఖ, అనంతర ప్రెస్ కాన్ఫరెన్స్ ఖచ్చితంగా ధికరణ స్వభావం కలిగినవేనని నొక్కి చెప్పారు. లేఖ రాసిన సందర్భం, అందులోని వివరాలు వెళ్లడించడం వెనక ఉద్దేశ్యాలు అనుమానం కలిగిస్తున్నాయన్నారు. జగన్ లేఖను కోర్టు ధిక్కరణగా పరిశీలించేందుకు తన అనుమతి కోరిన న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ కు సమాధానంగా ఆయన ఈ రిప్లై లేఖ విడుదల చేశారు.
రాజకీయనాయకులపై ఉన్న కేసుల పరిష్కారానికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలనేపద్యలో ఈ లేఖను ప్రత్యేకంగా చూడాల్సిందేనని కేకే వేణుగోపాల్ అన్నారు. 31 కేసులు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి రాసిన లేఖ ఈ సందర్భం అనుమానాలకు తావిస్తోందని అభిప్రాయపడ్డారు.