రాజకీయాల్లో అన్నింటికంటే ముఖ్యమైనది ప్రజాస్వామ్యం.
అది శాంతంగా ఉన్నంత కాలమే ప్రజలు హాయిగా నిద్రపోతారు.
ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా పాలన నడిపితే ప్రతి ఒక్కరు నష్టపోతారు.
వైసీపీ అధినేత జగన్ ఈ విషయం తెలుసుకోవాలి అంటున్నారు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్.
ప్రతిపక్షాలు విమర్శలే చేస్తాయి. దానికి గట్టి రిప్లై ఇవ్వాలి గాని దాడులు చేయడం ఏమిటి? జగన్ ముఖ్యమంత్రి పదవిలో శాశ్వతంగా ఉండరు. ఇలా అధికారంలోకి వచ్చిన వారంతా దాడులకు తెగపడితే ప్రజలకు, ప్రజాస్వామ్యానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి… జగన్ చేసింది బిగ్ మిస్టేక్. అసలు ప్రజలు ప్రతిపక్షాల మీద ఈగ వాలకుండా చూసుకుంటనే జగన్ కు లాభం. కానీ దాడులు చేయిస్తే అది జగన్ కే నష్టం అని నాగేశ్వర్ వ్యాఖ్యానించారు.
ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే పూర్తిగా వినండి.