• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

రాము వెనిగండ్ల కి అట్లాంటా టీడీపీ, జనసేన సంపూర్ణ మద్దతు!

admin by admin
October 15, 2023
in NRI, Trending
0
0
SHARES
435
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడివాడ (Gudivada) శాసనసభకు పోటీ చేయనున్న అమెరికాలోని జార్జియా రాష్ట్రం అట్లాంటా నగర వాసి రాము వెనిగండ్ల కి అనూహ్య మద్దతు దక్కింది.

తెలుగుదేశం, జనసేన ఇలా అట్లాంటా (Atlanta) ప్రవాసులు అందరూ ఏకమై సమైక్యంగా సంపూర్ణ మద్దతు తెలిపారు.

‘అట్లాంటా ఫర్ రాము వెనిగండ్ల’ అని శుక్రవారం అక్టోబర్ 13న స్థానిక సంక్రాంతి రెస్టారెంట్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో తెలుగుదేశం (Telugu Desam Party) మరియు జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఏకాభిప్రాయ మద్దతు తెలియజేశారు.

అందరికీ ఆప్తులైన రాము వెనిగండ్ల ని అక్కున చేర్చుకున్నారు.

అమెరికాలోని రిపబ్లికన్ పార్టీ లో చురుకుగా ఉండే సంక్రాంతి రెస్టారెంట్ అధినేత శ్రీనివాస్ నిమ్మగడ్డ (Srinivas Nimmagadda) ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

అమెరికా రాజకీయ నాయకులకు రిపబ్లికన్ నేషనల్ కమిటీ (Republican National Committee) నిర్వహించే తరహాలో అనుభవం మేరకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

రాము వెనిగండ్ల మాట్లాడుతూ.. వెనిగండ్ల ఫౌండేషన్ (Venigandla Foundation) ద్వారా గుడివాడ లో ఇప్పటికే ఉచిత మెగా ఆరోగ్య శిబిరాలు, అన్న క్యాంటీన్ల ద్వారా అన్నదానం, ఉద్యోగ మేళాలు, రైతు భరోసా, ఆపదలో ఉన్నవారికి ఆర్ధిక సహాయం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

గుడివాడ మరో కొడాలి నాని ని కోరుకోవడం లేదంటూ పలు ప్రజోపయోగ కార్యక్రమాలతో గుడివాడ అడ్డాలో తెలుగుదేశం పార్టీ జెండాను తిరిగి రెపరెపలాడించడానికి రాము (Ramu Venigandla) మదిలోని ఆలోచనలను, అలాగే ఆ ఆలోచనలను అమలుపరిచే విధివిధానాలను కూలంకుషంగా వివరించారు.

ఈ కార్యక్రమంలో అట్లాంటా తెలుగుదేశం పార్టీ నేతలు అంజయ్య చౌదరి లావు, సతీష్ ముసునూరి, మల్లిక్ మేదరమెట్ల, శ్రీనివాస్ లావు మరియు శ్రీనివాస్ నిమ్మగడ్డ ప్రసంగించారు.

అలాగే అట్లాంటా జనసేన పార్టీ నేతలు సురేష్ ధూళిపూడి, ఇన్నయ్య ఎనుముల, వెంకట్ మీసాల ప్రసంగిస్తూ వ్యక్తిగతంగా మరియు పార్టీ పరంగా రాము కి మద్దతు తెలిపారు.

ఈ కార్యక్రమానికి వచ్చిన పలువురు వారి అభిప్రాయాలను, సూచలను, సలహాలను రాము వెనిగండ్లతో పంచుకోవటం జరిగింది.

అలాగే పలువురు అడిగిన ప్రశ్నలకు రాము తనదైన సమాధానాలు ఇచ్చారు.

ఆహ్వానితులందరూ రాము వెనిగండ్ల (Ramu Venigandla) తో ఫోటోలు దిగారు.

ఈ సందర్భంగా వెనిగండ్ల ఫౌండేషన్ ద్వారా గుడివాడ నియోజకవర్గంలో రాము చేస్తున్న సేవాకార్యక్రమాల వీడియోలు ప్రదర్శించారు.

అగ్ర రాజ్యం అమెరికాలో ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ, తను పుట్టి పెరిగిన గుడివాడని అభివృద్ది పథంలో నడపాలని కుల మత ప్రాంతాలకతీతంగా అన్ని వర్గాల వారికి రాము చేస్తున్న ప్రయత్నాలను సభికులు అభినందించారు.

తెలుగుదేశం, జనసేన (Janasena) నేతలు తమ పార్టీల జండాలు, కండువాలతో మూకుమ్మడిగా పెద్ద ఎత్తున మద్దతు తెలపడమే కాకుండా, గుడివాడ నియోజకవర్గంలోని తమ కుటుంబ సభ్యులను, స్నేహితులను సమన్వయపరిచి రాము వెనిగండ్ల విజయయానికి దోహదపడతామనడం అభినందనీయం.

అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి (Nara Chandrababu Naidu) ని చట్టవిరుద్ధంగా, అక్రమంగా అరెస్టు చేయడాన్ని అందరూ ముక్తఖంఠంతో ఖండించారు.

ఉయ్ ఆర్ విత్ సీబీఎన్, సేవ్ డెమోక్రసీ సేవ్ ఏపీ, ఉయ్ డిమాండ్ జస్టిస్, సైకో పోవాలి.. సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు.

సుమారు 500 మంది పాల్గొన్న ఈ అట్లాంటా ఫర్ రాము వెనిగండ్ల (Atlanta for Ramu Venigandla) కార్యక్రమానికి మహిళలు సైతం హాజరవ్వడం విశేషం.

అనీల్ యలమంచిలి, భరత్ మద్దినేని, మురళి బొడ్డు, మధుకర్ యార్లగడ్డ మరియు వినయ్ మద్దినేని తదితరులు ఈ ఈవెంట్ ని విజయవంతం చేయడంలో సహాయసహకారం అందించారు.

ఈ కార్యక్రమానికి ఫొటోగ్రఫీ & వీడియో సేవలను వాకిటి క్రియేషన్స్ (Vakiti Creations) నుంచి శ్రీధర్ రెడ్డి వాకిటి & ప్రవీణ్ బొప్పన, ఆడియో & మ్యూజిక్ సేవలను AR Dazzle Events నుంచి రజనీకాంత్అం దించారు.

భోజనానంతరం వందన సమర్పణలో భాగంగా ఎన్నారై టీడీపీ అట్లాంటా (NRI TDP Atlanta) నాయకులకు, కార్యకర్తలకు, అట్లాంటా జనసేన (Atlanta Janasena) నాయకులకు, కార్యకర్తలకు, అలాగే రాము వెనిగండ్ల కోసం కార్యక్రమం ఆసాంతం పాల్గొని విజయవంతం చేసిన ఆహ్వానితులకు కృతజ్ఞతలు తెలిపి కార్యక్రమాన్ని ముగించారు.

Tags: atlantajanasenanri tdpramu venigandla
Previous Post

చంద్రబాబు ఆరోగ్యంపై పవన్ ఆందోళన

Next Post

చంద్రబాబు కోసం అమెరికా దేవాలయాలలో ఎన్నారైల ప్రత్యేక ప్రార్థనలు!

Related Posts

Andhra

`సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌

June 20, 2025
Andhra

రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!

June 20, 2025
Andhra

రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్

June 19, 2025
Andhra

జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!

June 19, 2025
Movies

`కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!

June 19, 2025
Andhra

జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్

June 18, 2025
Load More
Next Post

చంద్రబాబు కోసం అమెరికా దేవాలయాలలో ఎన్నారైల ప్రత్యేక ప్రార్థనలు!

Latest News

  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra