ఏపీ అధికారపక్షంలో చాలామంది అర్థం పర్థం లేకుండా మాట్లాడి వైసీపీని గబ్బు పట్టిస్తుంటారు… కానీ ఒక్క పేర్ని నాని మాత్రం వైసీపీకి డ్యామేజ్ కాకుండా ఇతర పార్టీలపై దాడి చేస్తుంటారు. మంచి మాటకారిగా పేరొందిన పేర్ని నాని ఇపుడు తెరమీదకు వచ్చారు.
వైసీపీ నేతలు అంబటి రాంబాబు, కొడాలి నాని ఇతర వైసీపీ నేతలు లోకేష్ పుట్టుక గురించి తీవ్ర అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేయడంతో అది చంద్రబాబును ఎంత బాధపెట్టిందో నందమూరి కుటుంబాన్ని కూడా అంతే బాధ పెట్టింది.
నందమూరి ఆడబిడ్డకు జరిగిన అవమానంతో అందరూ వారంతా ఒక్కటయ్యారు. ఇలాంటి సీన్ గతంలో సాధారణ సందర్భంలో ఎన్నడూ లేదు. అన్ని పార్టీల్లో ఉన్న అన్ని రంగాల్లో ఉన్న నందమూరి కుటుంబం అంతా నారా భువనేశ్వరికి మద్దతుగా నిలిచింది. అందరూ ఏకమై వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు. దీంతో వైసీపీ ఆత్మరక్షణలో పడింది.
ఈ ఎపిసోడ్ కు సంబంధించి వైసీపీ నేతలు ఇప్పటివరకు కౌంటర్ అటాక్ చేస్తున్నా.. అధికారపక్షం నేతలు తొందరపడ్డారన్న భావన సామాన్య ప్రజల్లో నెలకొందని చెప్పాలి. దీనికి తోడు ఇప్పుడు నందమూరి కుటుంబ సభ్యులు.. పార్టీలకు అతీతంగా తెర మీదకు వచ్చి చేస్తున్న వ్యాఖ్యలు వాతావరణాన్ని మరింత వేడెక్కించేలా మారాయి. చివరకు ఎన్టీఆర్ కూడా దీనిపై గట్టిగానే స్పందించారు. భారీగా వైసీపీకి డ్యామేజీ జరిగే ప్రమాదం కనపడటంతో వైసీపీ మాటకారి అయిన పేర్నినానిని రంగంలోకి దించింది.
‘‘చంద్రబాబు సతీమనిని ఎవరైనా ఏమైనా అంటే.. ఆ ఫోన్ రికార్డును బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు చంద్రబాబు సతీమణి ప్రస్తావన అసెంబ్లీలో రాలేదన్నారు. ఆమె పేరును అసెంబ్లీలో ప్రస్తావించినట్లుగా చంద్రబాబు చిత్రీకరిస్తున్నారంటూ మండిపడ్డారు. నిందా పూర్వక ధోరణితో చంద్రబాబు కొత్త సంప్రదాయనికి తెర తీశారు. అంత సంస్కారం లేకుండా ఎవరూ మాట్లాడరు’’ అని పేర్ని నాని అన్నారు.
అసెంబ్లీలో వైసీపీ నేతలు అన్నమాటలు వీడియో సహితంగా బహిరంగంగా కనిపిస్తుంటే ఎక్కడన్నారు? ఎవరన్నారు ? అని వైసీపీ చేస్తున్న మెలో డ్రామా జనాలకు వెగటు పుట్టిస్తోంది. పేర్ని నాని కాదు, జగన్ వచ్చినా ఈ డ్యామేజ్ నుంచి వైసీపీని ఎవరూ కాపాడలేరు.
విషయం చంద్రబాబు నుంచి డైవర్టు అయి ఎన్టీఆర్ కుటుంబం మీదకు రావటంతో.. ఆ ఇష్యూను తనదైన శైలిలో కూల్ చేయాలన్న వైసీపీ ప్రయత్నం పూర్తిగా విఫలమైందనే చెప్పాలి.