ఇప్పుడంటే వినోదానికి ఢోకా లేదు. సినిమాలు.. టీవీ చానళ్లు.. ఓటీటీ ఫ్లాట్ ఫాంలు.. యూ ట్యూబ్.. ఇలా చెప్పుకుంటూ పోతే వినోదానికి అంతుపొంతు లేని పరిస్థితి. కానీ.. దాదాపు 35 ఏళ్ల క్రితం అందుకు భిన్నమైన పరిస్థితులు.
అప్పట్లో చాలా తక్కువ మంది ఇళ్లల్లోనే టీవీలు ఉండేవి. పరిమిత సమయం పాటు అందులో ప్రసారమైన కార్యక్రమాల్ని చూసేందుకు.. మిగిలిన పనులన్ని పూర్తి చేసుకొని వెయిట్ చేసేవారు. అలాంటి వేళలో వచ్చిన రామాయణ్ ఎంతలా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సీరియల్ లో రాముడు.. సీత.. రావణుడు.. లక్ష్మణుడి పాత్రలు నిజంగానే అలానే ఉండేవేమో అన్నట్లుగా ఉండేవి.
అలా మంచి పేరు తెచ్చుకున్న వారిలో రావణ పాత్రధారి అరవింద్ త్రివేది. తాజాగా ఆయన తుదిశ్వాస విడిచారు. మంగళవారం రాత్రి గుండె పోటు రావటంతో ఆయన మరణించారు. పెద్ద వయస్కుడు కావటంతో అనారోగ్య సమస్యల్ని ఆయన ఎదుర్కొంటున్నారు.
చాలా కాలం నుంచి అనారోగ్యంతోఉంటున్న ఆయన 1991లో బీజేపీ తరఫున సబర్కాతా నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 1996 వరకు ఎంపీగా వ్యవహరించిన ఆయన్ను తాజాగా దహనుకార్ వాడి ప్రాంతంలోఅంత్యక్రియల్నిముగించా
తన నటనతో బుల్లితెర రావణుడిగా అలరించిన ఆయన.. కోట్లాది మందికి చేరువయ్యారు. ఇప్పుడు ఆయనో మెమరీగా మారారని చెప్పక తప్పదు.
అప్పటి వినోద కష్టాలు ఇప్పటివారికి తెలియవు. ఈ కాలంలో ఎప్పుడు ఎక్కడ ఉన్నా.. కాసింత మొబైల్ డేటా ఉంటే చాలు.. ప్రపంచం మొత్తం అర చేతిలో ఉన్నట్లే. ఒకవేళ రిమోట్ ప్లేస్ లోకి వెళుతున్నానన్న విషయం మీద ఐడియా ఉంటే.. ముందే మనసుకు నచ్చిన సినిమాల్ని డౌన్ లోడ్ చేసుకొని సెల్ ఫోన్ లో సేవ్ చేసుకొని చూసే వీలుంది. ఇవేమీ లేనపుడే అరవింద్ త్రివేది ఎంతో పేరు సంపాదించారు.