వివాదం ఎలా ఉన్నా కూడా మాజీ మంత్రి నారాయణ కేసు చుట్టూ ఉన్న నీలి నీడలు తొలగిపోయాయి. అరెస్టు వెంటనే బెయిలు రావడం, దీనిపై హైకోర్టుకు వెళ్తామని ఇవాళ సజ్జల చెప్పడం అన్నీ అన్నీ చకచకా జరిగిపోతున్నాయి. అంటే ఈ ఎపిసోడ్ లో ఏ ట్విస్టులు పెద్దగా వైసీపీ ఆశించినంత గొప్పగా ఏమీ లేవు.
అయితే ఈ కేసులో మరో చిన్న ట్విస్టు ఫోన్ ట్యాపింగ్.. నారాయణ ఫోన్ ట్యాపింగ్ చేశామని నెల్లూరు పెద్దాయనను ఉద్దేశించి చిత్తూరు పెద్దాయన అయిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఇదొక్కటి మినహా ఈ కథలో పెద్ద ట్విస్టులు ఏమీ లేవు. నారాయణ అరెస్టు తరువాత వైసీపీ చెప్పాలనుకున్న మాటల్లో కూడా క్లారిటీ పూర్తిగా మిస్ అయింది.
పేపర్ లీక్ అయితే సంబంధిత ప్రక్రియను పూర్తి గా రద్దు చేయాలి. పరీక్షను మళ్లీ నిర్వహించాలి
ఇవేవీ చేయకుండా ఎలా తప్పించుకుంటారని అని ప్రశ్నిస్తున్నారు ఇంకొందరు. ఇక ఈ కథలో నారాయణ మాత్రమే కాదు శ్రీ చైతన్య విద్యా సంస్థల ప్రతినిధులూ ఉన్నారు కనుక వాళ్ల సంగతేంటి ఆ సంస్థల అధినేతలను మీరు అరెస్టు చేయరా అని సోషల్ మీడియాలో ఇంకొందరు లాజికల్ డ్రైవ్ ను కొనసాగిస్తున్నారు.
అరెస్టులు ఏమయినా కానివ్వండి, ఎన్నయినా కానివ్వండి తాము అందుకు సిద్ధమేనని అంటున్నారు టీడీపీ నాయకులు. అరెస్టుల కారణంగా మనోబలం తగ్గదు కానీ పెరిగే అవకాశాలే తమకు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు టీడీపీ నాయకులు.
గతంలో చేసిన అభియోగాలే ఎఫ్ఐఆర్ లో నమోదు చేయించారని, వీటిలో ఏ కొత్తదనం లేదని, సీఆర్డీఏను పునరుద్ధరించారు కనుక ఫైళ్లను ఒక్కసారి తనిఖీ చేసుకోవాలని కూడా అచ్చెన్నలాంటి లీడర్లు హితవు చెబుతున్నారు. అరెస్టు న్యాయ ప్రక్రియ సంబంధించినప్పటికీ ముందస్తు నోటీసులు లేకండా చేయడంలో ఉద్దేశం ఏంటన్నది తమకు తెలుసు అని అంటున్నారు వారు.
ఏదేమయినప్పటికీ తెలుగుదేశం పార్టీలో అరెస్టు ప్రకంపనలు పెద్దగా లేవు కానీ వైసీపీలో మాత్రం బాగానే ఉన్నాయి అన్నది ఇవాళ సుస్పష్టం అవుతున్న విషయం. ఇక రాజధాని ఆరోపణలు కానీ, ల్యాండ్ పూలింగ్ వివరం కానీ గతంలో క్లారిటీ ఇచ్చినా కూడా శాఖాపరంగా విచారణ చేపట్టకుండా అక్రమాలు తేల్చుకుండా పదే పదే అవే మాటలు చెప్పడం ఓ విధంగా ప్రభుత్వ వైఫల్యమే అన్నది పసుపు దండు మాట! మాటలు కూడా !