సరైన ఇసుక పాలసీ రచించడంలో తలమునకలవుతున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అసమర్థతపై విరుచుకుపడ్డారు నరసాపురం ఎంపీ రఘురామరాజు. పార్టీ ని మూడు ప్రాంతాల్లో ముగ్గురు రెడ్ల చేతిలో పెట్టారు. ఇపుడు ఇసుకను మూడు ప్రాంతాల్లో ముగ్గురు రెడ్ల చేతిలో పెడతారు. పెట్టుకుంటే పెట్టుకోండి. ఆ ఇసుకేదో ప్రజలకు ఇవ్వండి… అంటూ రఘురామరాజు ఏపీ ఇసుక పాలసీని ఉతికారేశారు.
ఉచితంగా దొరికే దాన్ని డబ్బులకు అమ్ముతాం అంటారు. డబ్బులకు దొరికేదాన్ని ఉచితంగా ఇస్తామంటారు. ప్రతిదానికీ జగనన్న జగనన్న అని పేరు పెట్టి ఉచితంగా ఇస్తూ జనాలకు అవసరమైన ఇసుకలో మాత్రం ఎలా దోపిడీ చేయాలో ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తున్నారని రఘురామరాజు విమర్శించారు. వాగులో ఇసుక తవ్వి ఇక్కడ పోయడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావాలా? ఇంతకాలం ఇసుక పాలసీతో జనం ఇబ్బంది పెట్టి…. అది తప్పుడు పాలసీ అని చెప్పిన వాడిని తిట్టి… ఇపుడు ఆ పాలసీ తప్పని వాళ్లే తెలుసుకుని మరో కొత్త తికమకపాలసీ తెచ్చారంటూ తనదైన శైలిలో రఘురామరాజు ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
అది ఆయన మాటల్లో వింటే మరింత వివరంగా ఉంటుంది.