రాష్ట్రంలో గతంలో ఎన్నడూ చవి చూడని.. ప్రజలకు తెలియని రాజకీయాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేసిన వారికి .. షాకులు తగిలేవి. రచయితలు.. కవులు.. కళాకారు లపై కూడా దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. కర్ణాటకలో అయితే.. ఏకంగా.. ఒక రచయితను హత్య చేశారు. తర్వాత.. అనేక రూపాల్లో 2017-2018 మధ్య దేశంలో అనేక వివాదాలు తెరమీదికి వచ్చాయి. రాజ్యాంగం ప్రసాదించిన ఆర్టికల్ 19 ప్రకారం.. భావప్రకటనా స్వేచ్ఛపై చర్చ కూడా జరిగింది.
ప్రభుత్వాలను వ్యతిరేకించడం.. తప్పు అని రాజ్యాంగంలో ఎక్కడా చెప్పలేదు. భావప్రకటనకు, వాక్ స్వాతంత్య్రానికి పెద్దపీట కూడా వేసింది. అయితే.. ప్రభుత్వాలను విమర్శించనే కూడదు.. ఏం చేసినా.. పడి ఉండాలి.. అనే తరహా ప్రభుత్వాలు రావడంతో దేశంలో దీనిపై ఆసక్తికర చర్చప్రారంభమైంది.
ఇది ఇప్పటి వరకు కేంద్రానికి మాత్రమే పరిమితం అయితే.. ఇప్పుడు.. ఏపీకి కూడా పాకింది. జరిగిన పరిణా మాలను గమనిస్తే.. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను తప్పుబడుతున్న వారిపై కేసులు పెరుగుతున్నాయి.
సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని తీసుకువెళ్లి.. చిత్రహింసలకు గురిచేస్తున్న పరిణామం చర్చకు వస్తోంది. వాస్తవానికి ప్రభుత్వంపై.. విమర్శలు అనేవి ఇప్పుడు కొత్తకాదు. భవిష్యత్తులోనూ వీటిని ఎవరూ ఆపలేరు. విమర్శలను కూడా తమకు అనుకూలంగా మార్చుకున్న ప్రభుత్వాలు ఉన్నాయి.
గతం లో నెహ్రూ హయాంలో కామ్రెడ్ పుచ్చలపల్లి సుందరయ్య.. రాజ్యసభలో ప్రసంగిస్తుంటే.. ఓర్పుగా.. ఓపిక గా.. విన్న సంస్కృతిని సొంతం చేసుకున్న ఈ దేశంలో.. ఇప్పుడు పేట్రేగుతున్న అసహన రాజకీయం.. అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.
చంద్రబాబు హయాంలోనూ సర్కారును విమర్శించిన వారు ఉన్నారు. ఆయన పార్టీ విధానాలను తప్పుబ ట్టిన వారు కూడా ఉన్నారు. కానీ, ఇంతలా అయితే.. కక్ష తీర్చుకున్న రాజకీయాలు అప్పట్లో కనిపించలేద ని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.
కానీ, ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమపై ఎవరూ ఎలాంటి విమర్శలు చేయరాదని.. తామే దేశంలో అత్యుత్తమ పాలకులమని అనుకుంటే.. తప్పులు సరిదిద్దుకునేందుకు ఎవరికీ అవకాశం ఉండదు. అది అంతిమంగా వచ్చే ఎన్నికల్లో ఓట్ల రూపంలో రాలడం.. ఖాయం.
Comments 1