జగన్ వంటి అవినీతి కేసులున్న వ్యక్తిని ప్రజలు ఎన్నుకోవాలంటే అంత ఈజీ కాదు అని జగన్ గ్రహించారు. అందుకే అతను సమాజంలో ఉన్న ఒక అసూయను పెద్దది చేసి కులాల విభజన చేసి ప్రజలను కొత్త కలహాలతో విడిపోయేలా చేశాడు. దీంతో జగన్ కేసులను జనం మరిచిపోయారు. నిత్యం కులపోరుతో మానిసకంగా కుళ్లి కుమిలిపోయారు.
ఈ క్రమంలో జగన్ వేసిన అతిపెద్ద స్కెచ్ ఏపీ ప్రజలను కమ్మ- నాన్ కమ్మ వర్గాలుగా విభజించాడు. కమ్మ వాళ్లపై అసూయను పెంచి పోషించి వారే మీ శత్రువులు అన్నట్టు ప్రొజెక్ట్ చేశాడు. దీనికి అమరావతికి కూడా కుల ముద్ర వేశాడు. కేవలం 7 శాతం కమ్మవాళ్లు ఉన్న రాజధానిని అంతా కమ్మోళ్లే అని నమ్మించడం జగన్ రెడ్డి మొదటి విజయం.
జగన్ ను తక్కువ అంచనా వేసిన చంద్రబాబు అతను చేస్తున్న ప్రచారాన్ని ఖండించకుండా తన పని తాను చేసుకుంటూ పోయాడు. చంద్రబాబు ఓడిపోయాడు… కమ్మ వారి మీద కోపం తామేం చేస్తున్నామో కూడా ప్రజలు గ్రహించలేకపోయారు. చివరకు కమ్మవాళ్లు వ్యక్తిగతంగా నష్టపోయింది ఏమీ లేదు. కానీ ఏపీ పరిస్థితి ఏంటి… కొన్ని వేల కంపెనీలను పోగొట్టుకుంది. రాజధాని లేకుండాపోయింది. పోలవరం పోగొట్టుకుంది. అన్నింటికి మంచి ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక వేత్తల్లో నమ్మకాన్ని పోగొట్టుకుంది. సరే అవన్నీ మాకెందుకు అని జనం అనుకోవచ్చు.
జనానికి నేరుగా సంబంధం ఉన్న విషయం ఒకటి మాట్లాడుకుందామా? రండి…
హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఆసియాలోనే అతిపెద్ద ప్రైవేట్ ఆసుపత్రిని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. 6,000 కోట్ల వ్యయంతో నిర్మించబడిన ఆస్పత్రిలో 2,600 పడకల సామర్థ్యం ఉంది. అమృత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉత్తర మరియు ఈశాన్య భారతదేశంలోని రోగులకు అత్యాధునిక ఆరోగ్య సేవలను అందించనుంది.
అయితే ఆసుపత్రి మొదటి దశలో 550 పడకలను ప్రారంభించి, 18 నెలల్లో 750కి అప్‌గ్రేడ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2027-29 నాటికి ఆసుపత్రి 2,600 పడకలతో పూర్తి స్థాయిలో పని చేస్తుంది. పూర్తి స్థాయిలో, ప్రైవేట్ వార్డులలో 1,000 పడకలు ఉంటాయి. రోగుల కుటుంబ సభ్యుల కోసం 498 గదుల గెస్ట్‌హౌస్
ఇదంతా మాకెందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా?
ఇది అమరావతిలో శంకుస్థాపన చేసకున్న ప్రాజెక్టు. జగన్ రెడ్డి అమరావతిని చంపేయాలన్న లక్ష్యంతో కమ్మ వాళ్లు టార్గెట్ చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలన్న లక్ష్యంతో అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతోపాటు ఈ ఆస్పత్రికి కేటాయించించిన స్థలాన్ని రద్దు చేశారు. అసలే తక్కువ ధరకు సేవలు అందించే ట్రస్ట్ ఆస్పత్రి ఇది. అమరావతిలో ఈ ఆస్పత్రి కట్టి ఉంటే ఏపీలో పేదలు, మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ఏ వైద్యం కోసం మనం హైదరాబాదు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. పైగా ఈ ఆస్పత్రి ద్వారా 10 వేల మంది తెలుగు వారికి డాక్టర్, నర్సు ఉద్యోగాలు వచ్చేవి. అంత మంది అమరావతిలో ఉంటే వారి వల్ల ఇంకా ఎంతో మందికి ఇతర ఉపాధి దొరికేది.
మరి జగన్ రెడ్డి నిర్ణయం వల్ల ఇపుడు ఉత్తరాదికి తరలిపోయింది. మరి ఇపుడు నష్టపోయింది కమ్మవారా? ఏపీ ప్రజలా ? చెప్పండి?
ఇప్పటికైనా ఏపీ ప్రజలు మేలుకుని వాస్తవాలు తెలుసుకోకపోతే ఉద్యోగాలు మాత్రమే కాదు జీవితాలు కూడా ఉండవు.