పోలవరం ఆగింది…
అంటే రాయలసీమకు నీళ్లు ఆగిపోయాయి
అవన్నీ తెలంగాణ సొంతమైనట్లే
అమరావతి ఆగింది…
అంటే ఆంధ్రా అభివృద్ధి ఆగింది
అమరావతికి రావల్సిన సంపద హైదరాబాదుకు తరలిపోయినట్లే…
ఇంతేనా ఇంకా చాలా ఉంది.
తెలంగాణ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి పథకానికి సంబంధించి ఇటీవల జారీ చేసిన జీవో నికర జలాలపై గంపెడాశలు పెట్టుకున్న రాయలసీమలో అలజడి మొదలైంది. జాగ్రత్త పడకపోతే ప్రధానంగా రాయలసీమకు మరొక సారి సరిదిద్దలేని నష్టం జరుగుతుంది. మరి ఏపీ సర్కారు ఎందుకు సైలెంట్ గా ఉంది?
రాష్ట్రంలో ప్రతి చిన్న అంశంపై రచ్చ రచ్చ చేసే ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు కేసీఆర్ ఏపీని దెబ్బమీద దెబ్బ తీస్తున్నా ఒక్కరూ ఎందుకు నోరు విప్పడం లేదు?
ఏపీ సీఎం, ఏపీ మంత్రులు తెలంగాణలో తమ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను బలిచేస్తున్నారనే భావన క్రమేణా రాయలసీమ ప్రజలకు ఇపుడు బాగా అర్థమైంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ బరితెగించి ఏకంగా 90టియంసిలకు టెండర్ పెట్టారు. అయినా… ఏపిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాగునీటి రంగాన్ని అసలు పట్టించుకోలేదు. అంతర్ రాష్ట్ర జల వివాదాలను పట్టించుకోకుండా భవిష్యత్తు తరాలకు జగన్ సర్కారు తీవ్రఅన్యాయానికి తలపెడుతోంది