ఏపీ సర్కారుకు మరోసారి హైకోర్టులో పెద్ద షాకే తగిలింది. రహస్య జీవోలు అంటే.. అర్ధం వివరించాలని కోర్టు నిలదీసింది. అంతేకాదు.. జీవోలను అసలు ఎలా విభజిస్తారని .. ప్రశ్నించింది. రహస్య జీవోలు.. సాధారణ జీవోలు అనే విభజన ఎందుకు? అని ప్రశ్నించింది. ఇదేమన్నా పాకిస్థాన్ బోర్డర్లో ఉన్న రాష్ట్రమా? రహస్యంగా ఉంచేందుకు..? అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వెబ్సైట్లో ఎందుకు పెట్టట్లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సాఫీగా జరిగే ప్రక్రియకు ఆటంకం కల్పించడంపై ధర్మాసనం మండిపడింది. అన్ని జీవోల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన న్యాయస్థానం.. విచారణ ఈనెల 28కి వాయిదా వేసింది.
జీవోల అంశంపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎలమంజుల బాలాజీ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ తీరు.. సమాచార హక్కు చట్టానికి వ్యతిరేకమని, ప్రభుత్వం జారీ చేస్తున్న జీవోల్లో 5 శాతమే వెబ్సైట్లో ఉంచుతున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ప్రభుత్వ తరఫు న్యాయవాది.. అతి రహస్య జీవో మాత్రమే అప్లోడ్ చేయట్లేదని కోర్టుకు తెలిపారు.
ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. జీవోలు రహస్యం, అతిరహస్యమని ఎలా నిర్ణయిస్తారని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అన్ని జీవోల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశించిన హైకోర్టు.. వెబ్సైట్లో ఉంచిన, రహస్య జీవోల వివరాలు తెలపాలని స్పష్టం చేసింది. అనంతరం విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది.
జీవోల్లో 5శాతమే వెబ్సైట్లో ఉంచుతున్నారు. ప్రభుత్వ తీరు సమాచార హక్కు చట్టానికి వ్యతిరేకం’’ అని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. అయితే అతి రహస్య జీవోలు మాత్రమే వెబ్సైట్లో అప్లోడ్ చేయట్లేదని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు వివరించారు. ఇరుపక్షాల వాదనలు అనంతరం హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. జీవోలు రహస్యం, అతిరహస్యమని ఎలా నిర్ణయిస్తారు? అన్ని జీవోల వివరాలు ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మరి ఇకమీదటైనా.. ప్రభుత్వం జీవోల రహస్యాలను పక్కన పెడుతుందా.? లేదా? అనేది చూడాలి.