ఏపీలో మరో దుమారం తెరమీదికి వచ్చింది. మరో నాలుగు రోజుల్లో ఇంటా బయటా కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకునే వినాయక చవితి వేడుకలపై సర్కారు.. తనదైన శైలిలో హుకుం జారీ చేసింది. బహిరంగంగా నాలుగు రోడ్లకూడలిలో వేసుకునే చవితి పందిళ్ల నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించినట్టు సమాచారం.
చందాలు వసూలు చేసుకుని వేసే వినాయక చవితి పందిళ్లకు రిజిస్ట్రేషన్ ఫీజు విధించాలని.. అధికారులను ఆదేశించడంతో వారు ఇప్పుడు పోలీసులను వెంటబెట్టుకుని… నిర్వాహకుల చెంతకు పరుగులు పెడుతున్నారు. అయితే..ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ ఉంది. పందిళ్లలో..జగన్ ఫొటోలు.. పార్టీ జెండాలు కట్టి ఉంటే.. వాటిని రిజిస్ట్రేషన్ చార్జీల నుంచి మినహాయించారు.
మిగిలిన వారు మాత్రం ఖచ్చితంగా.. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని.. ఒక్కొక్క.. పందిరికి రూ.1000 నుంచి రూ.5000 వరకు గరిష్ఠంగా చెల్లించాలని.. అధికారులు తమపై ఒత్తిడి తెస్తున్నారని.. పందిళ్లను వేసే నిర్వాహకులు చెబుతున్నారు. ఇక, ఈ విషయంపై.. స్వామీజీలు కూడా జోక్యం చేసుకున్నారు. ఈ విధానం సరికాదని.. సాధు పరిషత్ అధ్యక్షుడు అన్నారు. ఏపీ ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా అనుమతులు ఇవ్వలేదని, ఇప్పుడు ఫీజులు అనడం ఏంటని.. ఆయన నిలదీశారు.
దీనికి సంబంధించి విశాఖలో రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతీ స్వామి మాట్లాడుతూ.. రకరకాల అనుమతులు, ఫీజులు చెల్లించాలని.. చవితి పందిళ్ల నిర్వాహకులను వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
సాధారణంగా మండపాలను చందాలు వసూలు చేసుకొని ఏర్పాటు చేసుకుంటారని.. వాటిపై ఫీజులు ఏంటని ప్రశ్నించారు. రెండేళ్లుగా కరోనా పేరిట పలు అంక్షలు పెట్టిన ప్రభుత్వం.. ఈసారి అనుమతుల పేరుతో ఇబ్బందుల పాలు చేస్తోందని విమర్శించారు. ఇప్పటికే పోలీసులు నానా ఇబ్బందులతో అనుమతులు ఇస్తున్నారని.. దీనికి ఇప్పుడు సర్కారు కూడా ఫీజులు వసూలు చేయాలని అనుకోవడం సరికాదని..ఆయన అన్నారు. మొత్తానికి మరో వివాదానికి ఏపీ కేంద్రంగా మారిందని అంటున్నారు .
జగన్ రెడ్డి అడ్డమైన నిబంధనలు పెట్టి రాష్ట్ర ప్రజలు ఎవరు వినాయక చవితి పండుగను చేసుకోకుండా ఉండడానికి కుట్ర పన్నుతున్నాడు. రాష్ట్ర ప్రజలపై పన్నుల భారం మోపింది సరిపోదన్నట్లు వినాయకుడి మండపానికి రూ.1000 వసూలు చేస్తామని ప్రకటించి మరోసారి తాను తుగ్లక్ అని నిరూపించుకున్నాడు.@ysjagan pic.twitter.com/wSK7gShHxM
— Bonda Uma (@IamBondaUma) August 23, 2022