సంగం డైరీ పాల రైతులకు ఇస్తున్న రేటును తప్పుగా ముద్రించి ప్రచారం చేయడంపై ఏపీకి చెందిన సంగం డైరీ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. అసలు మేము ఇస్తున్న రేటు వేరు. అముల్ ఇస్తున్న రేటు మా రేటు కంటే తక్కువ, కానీ అముల్ ఎక్కువగా ఇస్తున్నట్లు కోట్లు ఖర్చుపెట్టి జగన్ సర్కారు తప్పుడు ప్రచారం చేస్తోందని సంగం డైరీ ఆరోపించింది.
సంగం డైరీ విడుదల చేసిన ప్రకటనలో ఏముందంటే…
అసెంబ్లీ సాక్షిగా మంత్రి కన్నబాబు చేసిన ప్రకటనను @Sangam_dairy తీవ్రంగా ఖండిస్తోంది. ఈరోజు @Amul_Coop సంస్థకు వ్యాపారం చూపించడానికి 1300 కోట్ల పెట్టుబడి పెట్టి రాష్ట్ర ప్రజలపై పెను భారం మోపుతున్న వ్యక్తి @ysjagan.
2019-20 ఆర్థిక సంవత్సరంలో అమూల్ డైరీ గేదె పాలు లీటరుకు రూ.45.48, ఆవుపాలు లీటరుకు 28 రూపాయలు చెల్లించగా సంగం డైరీ కొనుగోలు చేసిన 9.06 కోట్ల లీటర్ల పాలను గేదెపాలకు 46.83 రూపాయలు, ఆవుపాలకు 30.19 రూపాయలు అమూల్ కంటే అధిక ధర రైతుకు చెల్లించి కొనుగోలు చేయడం జరిగింది.
సంవత్సరాది ఆదాయంలోనూ రైతులకు లీటర్ కు 2 రూపాయల నుంచి 5 రూపాయల వరకూ బోనస్ అందించడం జరిగింది.