ఏపీలో వైసీపీ నేతల నిరసన స్వరాలు.. డాల్బీ స్టీరియో రేంజ్లో వినిపిస్తున్నాయి. కొందరు తమంతట తాముగా పోయేందుకురెడీగా ఉండగా.. పార్టీనే కొందరికి పొగపెట్టేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో తాజాగా సీఎం జగన్ నచ్చి, మెచ్చిన రాజకీయ నాయకురాలు.. వైఎస్ కుటుంబానికి ఎంతో విధేయురాలు.. మాజీ హోం మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత నిరసన స్వరం బాగానే వినిపించారు.
తన భర్త రాజకీయంగా పార్టీ మారతానని అంటే.. తాను కూడా పార్టీ మారేందుకు రెడీ అని సుచరిత వ్యాఖ్యా నించారు. అయితే.. ఎక్కడా కూడా.. ఆమె దొరక్కుండా జాగ్రత్త పడ్డారు. రాజకీయాల్లో ఉన్నన్ని నాళ్లు.. తమ కుటుంబం జగన్‌తోనే ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తనది, తన భర్త దయాసాగర్(ఐఆర్ ఎస్ ఉద్యోగి)ది ఒకే మాట అని చెప్పుకొచ్చారు.
అలా కాకుండా దయాసాగర్ పార్టీ మారతాను.. నన్ను తనతో పాటు రమ్మంటే వెళ్తానని, తాను ఎంత రాజకీయ నాయకురాలినైనా, ఒక భార్యగా తన భర్త అడుగుజాడల్లో నడుస్తానని సుచరిత నర్మగర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం.
“రాజకీయంగా మా మనుగడ వైసీపీతోనే. జగన్‌తోనే. నా భర్త దయాసాగర్ నా స్టేట్మెంట్కి కట్టుబడే ఉంటారు. ఒకవేళ నా భర్త పార్టీ మారతానంటే.. ఎంత రాజకీయ నాయకురాలినైనా భర్త అడుగుజాడల్లో నడవాలి కాబట్టి ఆయనతో పాటు వెళ్లాల్సిందే. నా భర్త ఒక పార్టీలో.. నేను మరో పార్టీలో.. మా పిల్లలు మరో పార్టీలో ఉండరు“ అని తేల్చి చెప్పారు.
ఎందుకీ ప్రకటన?
అయితే.. సుచరిత ప్రకటనలో ఉన్న మర్మం అందరినీ విస్మయానికి ఏమీ గురి చేయలేదు. ఎందుకంటే.. తనను మంత్రి వర్గం నుంచి తొలగించిన నాటి నుంచి కూడా సుచరిత ఆవేదనతోనే ఉన్నారు. గుంటూరు జిల్లా పార్టీ ఇంచార్జ్‌గా కూడా బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. మంత్రి వర్గం నుంచి తొలగించినప్పుడే.. ఆమె తన పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. సో.. ఈ పరిణామాలు గమనిస్తే.. ఒకటి ఆమె పార్టీ అయినా.. మారాలని నిర్ణయించుకోవడం. రెండు అధిష్టానాన్ని.. బ్లాక్ మెయిల్ చేయడం.. అనే అంటున్నారు పరిశీలకులు.
రాష్ట్ర హోంమంత్రి సుచరిత,షెడ్యూల్డు కులానికి కేటాయించిన స్థానం నుంచి ఎన్నికయ్యారు.నిజానికి ఆమె ఒక క్రిస్టియన్.దళితులను వెనక్కినెట్టి, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ,రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. #TirupatiByPoll లో గురుమూర్తి రూపంలో వైసీపీ ప్రజలను మళ్ళీ మోసం చేస్తోంది.
ఓటర్లూ జాగ్రత్త! pic.twitter.com/dsJMVX6ED4
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) April 15, 2021