మనదేశ రాజకీయ రంగంలో సుస్పష్టమైన ప్రణాళిక,దార్శనికత, ముందుచూపు కలిగిన అతి కొద్ది మంది నాయకుల్లో సీఎం చంద్రబాబు ఒకరు. విజన్ 2020 పేరుతో నేడు ఇరు తెలుగు రాష్ట్రాలు సాధించబోయే అభివృద్ధికి ఏనాడో బీజాలు వేసిన రాజకీయ మేధావి చంద్రబాబు. ఐటీ అంటే తెలుగు ప్రజలకు తెలియని రోజుల్లోనే హైదరాబాద్ లో ఐటీ రంగాన్ని అభివృద్ది చేయాలన్న ఆలోచన చంద్రబాబు విజన్ కు నిదర్శనం.
ఈ క్రమంలోనే చంద్రబాబుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా ప్రశంసలు కురిపించారు. ఆనాడు హైటెక్ సిటీ దగ్గర భూముల్లో అందరికి రాళ్లు, రప్పలు కనిపించాయని, కానీ, చంద్రబాబుకు మాత్రం మహా నగరం కనిపించిందని కొనియాడారు. చంద్రబాబు వంటి డైనమిక్ లీడర్ నాయకత్వంలో ఏపీ పునర్నిర్మాణం శరవేగంగా దూసుకుపోతోందని చెప్పారు. ముందుకు పోతోందని చెప్పారు. రాళ్లు, రప్పలతో ఉన్న భూములను చంద్రబాబు ఓ మహా నగరంగా మార్చారని, హైటెక్ సిటీ నిర్మించారని ప్రశంసించారు. గొప్ప పాలనాదక్షత ఉన్న లీడర్ ఏపీ సీఎంగా ఉండడం గర్వకారణమన్నారు.
ఇక, వైసీపీ పాలనలో సినిమా టికెట్లు, ఇసుక దోపిడీ ఇలా ఎన్నో అక్రమాలు జరిగినా ఐఏఎస్ అధికారులు అభ్యంతరం ఎందుకు చెప్పలేదని పవన్ నిలదీశారు. రెవెన్యూ వ్యవస్థలో నిస్సహాయతపై పవన్ అసహనం వ్యక్తం చేశారు. ఏపీ కలెక్టర్ల కాన్ఫరెన్స్ సందర్భంగా పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై ఐఏఎస్ అధికారులు ప్రేక్షక పాత్ర వహించడం ఆశ్చర్యం కల్గించిందన్నారు. జగన్ పాలనలో 10 లక్షల కోట్లు అప్పు అయిందని, జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి వచ్చామని అన్నారు.