‘ఆ 132 వెబ్ సైట్లను బ్యాన్ చేయండి’.. కేంద్రాన్ని కోరిన జగన్
కేంద్రప్రభుత్వాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా ఒక రిక్వెస్టు చేశారు. ఏపీలో 123 వెబ్ సైట్లను బ్యాన్ చేయాలని కోరారు. ప్రజా సంక్షేమానికి తీవ్ర విఘాతం కలిగించటమే కాదు.. తప్పుదారి పట్టిస్తూ.. ఆర్థికంగా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న వెబ్ సైట్లను వెంటనే నిషేధించాలని కోరారు. ఇంతకీ ఆ వెబ్ సైట్లు ఏవంటే.. ఆన్ లైన్ బెట్టింగ్.. ఆన్ లైన్ గేమింగ్ సైట్లుగా చెబుతున్నారు.
ఆన్ లైన్ బెట్టింగ్.. గేమింగ్ లకు పాల్పడటాన్ని ఏపీలో నేరంగా పరిగణించేలాచట్టాల్ని చేశామని.. అందుకే.. తాము సూచించిన 123 వెబ్ సైట్లనునిషేధించాలని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ను కోరారు. ఈ వెబ్ సైట్ల వల్ల సమాజంలో అనేక అనర్థాలకు దారి తీస్తున్నట్లుగా పేర్కొన్నారు. వీటికి అలవాటు పడిన వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లుగా ఆందోళన వ్యక్తం చేశారు. అనేక.. సామాజిక.. మానసిక రుగ్మతలకు లోనవుతున్నట్లుగా పేర్కొన్నారు.
ఈ అంశాల్ని పరిగణలోకి తీసుకొని.. ఏపీ గేమింగ్ యాక్ట్ 1974కు సవరణలు చేశామని.. కొత్త చట్టం ప్రకారం ఏపీలో ఇవన్ని శిక్షార్హమైన నేరాలుగా పేర్కొన్నారు. వీటిని నిర్వహించే కంపోనీల డైరెక్టర్లు కూడా శిక్షార్హులేనని పేర్కొన్నారు. సగటుజీవుల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తూ..వారిని భారీగా దెబ్బ తీస్తున్న ఈ వెబ్ సైట్ల విషయంలో కేంద్రం ఎంత వేగంగా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.