భారత సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం శ్రీ వైఎస్ జగన్ గారు pic.twitter.com/vYmG43uXNF
— DILLU (@KarimullaSk1991) December 29, 2022
ఏపీ ప్రభుత్వ సమాచార శాఖ తాజాగా మీడియాకు.. ముఖ్యంగా సోషల్ మీడియాకు.. ఒక వీడియో విడుదల చేసింది. ఇది `బాగా` ఎడిట్ చేసి మరీ మీడియాకు విడుదల చేసిన విషయం స్పష్టంగా తెలుస్తోంది. మరి దీనికి రీజనేంటి? అసలు దీనివెనుక ఉన్న అంతరార్థం ఏంటి? ఇదీ.. ఇప్పుడు చర్చకు వస్తున్న వీడియో ఏంటంటే.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్.. ఏపీలో పర్యటించారు.
తొలుత తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం.. ఆయన విజయవాడకు చేరుకున్నా రు. ఈ సందర్భంగా బెజవాడ దుర్గమ్మకు కూడా మొక్కుకున్నారు. ఈ గ్యాప్‌లో సీఎం జగన్ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్‌ను విజయవాడలోని ఓహోటల్లో కలుసుకున్నారు.
దీనికి సంబంధించిన ఎడిటెడ్ వీడియోనే.. మీడియాకు సమాచార శాఖ విడుదల చేసింది. దీనిలో ఏముం దంటే..సీజేఐ జస్టిస్ చంద్రచూడ్.. సీఎం జగన్‌కు నమస్కరించడం.. సీఎం ఆయన కు దుశ్శాలువా కప్పడం.. శ్రీవారి ప్రతిమను బహూకరించడం. అయితే.. ఇందులో తప్పేముంది.. ? అని కదా.. సందేహం! ఇక్కడే ఒక్కసారి వెనక్కి వెళ్తే.. గతంలోసుప్రీం కోర్టు మాజీ సీజేఐ ఎన్వీ రమణ కూడా విజయవాడ వచ్చారు.
అప్పుడు కూడా సీఎం జగన్ ఇదే హోటల్‌కు వెళ్లి.. ఆయనను కలుసుకున్నారు. కానీ, అప్పట్లో వీడియో విడుదల కాలేదు. గప్‌చుప్‌గా కలిసి వెళ్లిపోయారు. కానీ, ఇప్పుడు మాత్రం వీడియో విడుదల చేశారు. దీనికి రీజన్… అప్పట్లో సీజేఐగా ఉన్న రమణ సీఎం జగన్‌కు నమస్కరించకపోవడమేనని టాక్ పెద్ద ఎత్తున వినిపించింది.
ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. గతంలో చిరంజీవి, ప్రభాస్, రాజమౌళి వంటివారు వచ్చి సినీ పరిశ్రమ సమస్యలు చెప్పుకొన్నప్పుడు కూడా.. ఆ వీడియోను పూర్తిగా విడుదల చేయకుండా.. కేవలం చిరు
దణ్నం పెడుతున్న సీన్, మీరు మాకు తల్లిలాంటి వారు! అని చేసిన విన్నపాలను మాత్రమే విడుదల చేశారు. సో.. దీనిని బట్టి సీఎం జగన్ అంతరంగాన్ని ఎవరు ఎలాగైనా అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు పరిశీలకులు.