గన్నవరం చేరుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్న@naralokesh pic.twitter.com/weM08NZOi1
— శ్రీ ???????? (@Sri4TDP) October 19, 2021
టీడీపీ నేత నారా లోకేష్ హూటాహుటిన అమరావతికి బయలుదేరారు. ఆయన కొద్దిసేపటి క్రితం గన్నవరం ఎయిర్పోస్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయాన్ని పరిశీలిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అనంతరం టీడీపీ నేత పట్టాభి ఇంటిని కూడా పరిశీలిస్తారు.
ఏపీలో టీడీపీ ఆఫీసులపై జరుగుతున్న దాడులపై మీడియాతో మాట్లాడుతారని చెబుతున్నారు. ఆ తర్వాత టీడీపీ కార్యాలయాల దాడులకు నిరసనగా భవిష్యత్తు కార్యాచరణపై నేతలతో లోకేష్ చర్చించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు, నేతలపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పక్కా ప్రణాళికతో టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు చేశారని చెబుతున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతలు దాడి చేశారు.
గేట్లు నెట్టుకొని టీడీపీ కేంద్ర కార్యాలయం లోపలికి వైసీపీ శ్రేణులు వెళ్లారు. కార్యాలయంలో కనపడినవారిపై దాడి, అద్దాలు పూర్తిగా ధ్వంసం చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. విశాఖ, తిరుపతి, గుంటూరులోని టీడీపీ కార్యాలయాలపైనా వైసీపీ శ్రేణులు దాడులు చేశారు. టీడీపీ నేత పట్టాభి నివాసంపై కూడా దాడి జరిగింది. అంతేకాదు పలు విలువైన వస్తువులు ధ్వంసం చేశారని చెబుతున్నారు.
టీడీపీ కార్యాలయాలపై దాడికి నిరసనగా బుధవారం రాష్ట్ర బంద్‌కు టీడీపీ పిలుపు నిచ్చింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని మండిపడ్డారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
టీడీపీ నేతలు, కార్యాలయాలపై పక్కా ప్రణాళిక ప్రకారం దాడులు చేయిస్తున్నారని అమిత్‌షాకు చంద్రబాబుకు వివరించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ద్వారా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చారు. టీడీపీ కార్యాలయానికి కేంద్ర భద్రతాబలగాల రక్షణ కల్పించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.