ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వినుకొండ నియోజకవర్గంలో రాజకీయాలు ఏకపక్షంగా మారుతున్నాయా? ఇక్కడి ప్రజలు ఏకపక్షంగానే వచ్చే ఎన్నికలకు సంబంధించి తీర్పు ఇవ్వనున్నారా ? ఎటు చూసినా.. సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా ? విపక్ష పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు దూకుడు ప్రదర్శిస్తున్నారా ? ఆయనకే అనుకూలంగా ఇప్పుడు పరిస్థితి మారిందా ? అంటే నియోజకవర్గ పొలిటికల్ వాతావరణం అవుననే చెపుతోంది. నియోజకవర్గంలో ఈ దఫా మార్పు.. మెజారిటీ కూడా జీవీ వైపే ఉన్నాయని చెబుతున్నారు.
వినుకొండ నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుకు అనుకూల పవనాలు జోరుగా వీస్తున్నాయని అన్నీ సర్వే సంస్థలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన ఈ ఐదేళ్ల కాలంలో అంచనాలకు మించి పుంజుకున్నారు. పేదలకు చేరువయ్యారు. పార్టీ ఓటు బ్యాంకును కాపాడుకున్నారు. అంతేకాదు.. ఎప్పుడే అవసరం వచ్చినా.. నేనున్నానంటూ.. ముందుకు వచ్చారు. ఇదే ఇప్పుడు జీవీ భారీ మెజారిటీ దిశగా దూసుకుపోయేలా చేస్తోంది.
వాస్తవానికి ఎన్నికల సమయం చేరువ కావడంతో పలు సర్వే సంస్థలు ఇక్కడ వాలిపోయాయి. స్థానికంగా ఉన్న సంస్థలు కూడా.. సర్వేలు చేశాయి. ఇదే పల్నాడు జిల్లాకు చెందిన ఓ ప్రముఖ సెఫాలజిస్ట్ చేయించిన తాజా సర్వేలో వినుకొండలో జీవీ 15 వేల ఓట్ల మెజారిటీతో విజయం దక్కించుకుంటారని తేలింది. మరో సంస్థ రైజ్ సర్వేలో కూడా ఇదే విషయం వెలుగు చూసింది. ఎక్కడా జీవీకి వ్యతిరేకంగా చెప్పకపోవడం గమనార్హం.
జీవీ బంపర్ విక్టరీ కొట్టేందుకు కారణాలు ఇవి…!
– గత ఐదేళ్ల నిత్యం ప్రజల్లో ఉండడం.. ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం.. సమస్యల్లో ఉన్నవారికి ఆర్థిక సాయం అందించడం.
– నియోజకవర్గంలో ఇప్పటికీ.. జీవీ హయాంలో చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుండడం.. ఆయన వేసిన రోడ్లపైనే ఇప్పటికీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సహా వైసీపీ నాయకులు తిరుగుతుండడం వంటివి ప్రజల్లో చర్చగా మారాయి.
– బలమైన టీడీపీ ఓటు బ్యాంకు.. వినుకొండలో స్థానిక అభివృద్ధి.. జీవీకి ఉన్న గుడ్ ఇమేజ్ వంటివి ఆయనను భారీ మెజారిటీ దిశగా అడుగులు వేయిస్తున్నాయి.
– జీవీ హయాంలో ఎక్కడా ఎలాంటి సమస్యలు లేకపోవడం.. ఇప్పుడు ఎటు చూసినా.. దౌర్జన్యాలు.. దాడులు, పోలీసు కేసులు పెరిగిపోవడం వంటివి ప్రధాన సమస్యగా మారడంతో జీవీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు.
– ప్రస్తుత ఎమ్మెల్యే, ఆయన టీం వసూళ్ల పర్వంలో మునిగి తేలుతున్నారన్న వాదన ఉంది. కానీ, జీవీ కి ఇలాంటి పరిస్థితి లేక పోవడం కలిసి వస్తోంది.
– మహిళలతో పాటు రాజధాని ఏరియా ఎఫెక్ట్‌తో జీవీకి సానుకూలత ఉండడం.
– గత 2009, 2014 ఎన్నికల్లో 25, 22 వేల మెజారిటీతో లెక్కేసుకుంటే.. ఈ దఫా కనీసంలో కనీసం.. 30 వేల మెజారిటీ దక్కించుకుంటారనే టాక్ బలంగా వచ్చేసింది. మొత్తంగా చూస్తే జీవీ గెలుపు కాదు.. ఆయన మెజారిటీపైనే ఇప్పుడు అంచనాలు వెలువడుతున్నాయి.