సోషల్ మీడియాను అబద్ధాలను ప్రచారం చేయడానికి వైసీపీ వాడుకుంటే … కళ్ల ముందు కనిపించే విషయాలను నలుగురికి గుర్తుచేస్తు వైసీపీకి నిద్ర లేకుండా చేస్తున్నాడు నారా లోకేష్.
సర్కారు వచ్చినప్పటి నుంచి ధరలు పెంచి అందరితో డబ్బులు లాక్కుని కొందరికి పంచే ఒక విచిత్రమైన సూత్రంతో 5 కోట్లమందిపై ఏదో ఒక భారం వేస్తున్న జగన్ సర్కారు… ప్రజల నడ్డి విరుస్తున్న విషయం తెలిసిందే.
ప్రచారానికి పనికొచ్చే విషయాలపై, సెంటిమెంట్ పై తప్ప జనానికి పనికొచ్చేే దేనినీ వైసీపీ పట్టించుకోదు. వైఎస్ సమాధికి 27 కోట్లు ఖర్చు పెట్టిన జగన్ సర్కారు వరద బాధితులకు కేవలం 500 రూపాయలు (మొత్తం కేటాయింపులు సగటున లెక్కిస్తే వచ్చేది ఇంతే) హాస్యాస్పదం.
రాష్ట్రమంతటా పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ … వైఎస్ అని పేరు మార్చయినా కొనసాగించాల్సింది. కానీ అది కొనసాగిస్తే బాబుకు పేరు వస్తుందని, వైఎస్ పేరు పెట్టినా ఉపయోగం లేదని ఖరాఖండిగా నిర్దారించుకున్నాక వాటిని మూసేశారు. ప్రజలకు మేలు జరగడం అనేది సెకండరీ.. మొదటిప్రయారిటీ ఈ పనిచేస్తే వైసీపీ ఎంత పబ్లిసిటీ వస్తుంది? ఎన్ని ఓట్లు వచ్చే అవకావం ఉందన్నదే పాయింట్.
పనులు దొరక్క జనం అల్లాడుతున్న నేటి రోజుల్లో అన్న క్యాంటీన్లుంటే ఆ కథే వేరుండేది. కానీ వాటిని తొలగించిన విషయం అందరికీ తెలిసిందే. దానిపై తాజాగా లోకేష్ నిలదీసిన విధానం గవర్నమెంటుకు కాలిపోయేలా చేసింది.
అన్న క్యాంటీన్లు ప్రభుత్వానికి అదనపు భారం అంటూ పేదవాడి నోటి దగ్గర కూడు లాక్కున్న మీరు దొంగ పేపర్ అమ్ముకోవడానికి ప్రజల సొమ్ము మింగడం ఏంటి జగన్ గారు?ఒక పక్క ప్రకటనల పేరుతో వందల కోట్ల దోపిడీ. ఇప్పుడు ఏకంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో.. మీ అవినీతి కరపత్రిక పేరుతో ఐదున్నర కోట్లు కొట్టేస్తున్నారు.ప్రజలు సా”ఛీ” అనడంతో అడ్డదారుల్లో సర్క్యూలేషన్ పెంచడానికి నానా తంటాలు పడుతున్నారు. ఎంత పెంచినా దొంగ పత్రిక జన్మ రహస్యమైన అవినీతి కంపు పోతుందా?
ఇది లోకేష్ చేసిన కామెంట్. దీనికి ఏ సమాధానం చెప్పాలో తెలియక అసంబద్ధమైన సంబంధంలేని కామెంట్లతో వైసీపీ సోషల్ మీడియా యథాప్రకారం అబద్ధపు ప్రచారంతో లోకేష్ ట్వీట్ పై దాడికి దిగింది.