వీళ్ళు మనుషులా ? రాక్షసులా ?
ఆఖరకి మానసిక వికలాంగులు ఉండే పాఠశాలను కూల్చివేశారు… స్థలం కబ్జా చేస్తున్నారు…
వైజాగ్ చరిత్రలో ఇంత నాశనం ఎప్పుడు జరగలేదు…!
శుక్రవారం వస్టే అరెస్టులు, లేకపోతే కూల్చడాలు.!
ఈ రాష్ట్రాన్ని ఇక ఆ దేవుడే కాపాడాలి.. pic.twitter.com/a7ZblyHFww
— సొంగ మనోజ్ కుమాRRR (O positive blood group) (@Manu_SMK) June 6, 2021
ఏపీ సీఎం జగన్ వైఖరిపై ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. టీడీపీ నేతలపై అర్ధరాత్రి పూట కేసులు నమోదు చేయడం.. విశాఖలో తెల్లవారు జామున కూల్చివేతలకు పాల్పడడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దోపిడీని ఆధారాలతో సహా బయటపెట్టినందుకు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై అర్ధరాత్రి 12 గంటల 15 నిమిషాలకు కేసు పెట్టడం దుర్మార్గం. అర్ధరాత్రి కేసు నమోదు చేయడంతోనే ఇది అక్రమ కేసని, ఇందులో కుట్ర ఉందని అర్థమవుతోంది అని చంద్రబాబు దుయ్యబట్టారు.
‘‘వైసీపీ పాలకులు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ, పౌరహక్కులని అణచివేస్తున్నారు. పాలనాధికారం మూర్ఖుల చేతిలో ఉంటే… అరాచకంతోనే రాజ్యమేలుతారని జగన్‌రెడ్డి చర్యలతో మరోసారి స్పష్టమైంది.
ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఆనందయ్య తాపత్రయపడుతుంటే… వైసీపీ నేతలు అందులోనూ అవినీతికి ప్రయత్నిస్తున్నారు. వారి అక్రమాలను, అవినీతిని ప్రశ్నించే వారిపై అర్ధరాత్రి కేసులు నమోదు చేస్తున్నారు“ అని చంద్రబాబు పేర్కొన్నారు.
``ఆనందయ్య మందును ఉచితంగా పంపిణీ చేస్తానని చెబుతుంటే.. వైసీపీ ఎమ్మెల్యేలు.. మాత్రం నకిలీ వెబ్సైట్ రూపొందించి, మందును అమ్ముకోవడానికి ప్రయత్నించారు.
ఇలాంటి వారిని వదిలిపెట్టి… దానిని బట్టబయలు చేసిన సోమిరెడ్డిపై దొంగతనం, ఫోర్జరీ, చీటింగ్ అంటూ నాన్‌బెయిలబుల్ కేసులు పెడతారా? ఆనందయ్య అనుమతి నిరాకరించినా దొడ్డిదారిన ఆన్లైన్ అమ్మకాలకు ప్రయత్నించిన శేశ్రిత టెక్నాలజీ్‌సపై చర్యలేవి?“ అని నిలదీశారు.
ఆనందయ్య మందుపై దొంగతనంగా వ్యాపారం చేసేందుకు ప్రయత్నించిన వైసీపీ నేతలపైనే ఐసీపీ సెక్షన్ 379, 468, 506, ఐటీ యాక్ట్ 56 కింద కేసు పెట్టాలి. ఆనందయ్య మందు విషయంలో వైసీపీ నేతలు చేస్తున్నది ముమ్మాటికీ శవాలపై చిల్లర ఏరుకోవడమే. సోమిరెడ్డిపై కేసును తక్షణమే ఉపసంహరించుకో వాలి. ఆనందయ్య మందు పేరుతో వ్యాపారం చేయదలచిన వారిపై చర్యలు తీసుకోవాలి అని చంద్రబాబు డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌పై మరో కేసు నమోదు చేయడాన్ని కూడా చంద్రబాబు ఖండించారు.
గత నెలలో ఓ హోటల్లో సమావేశం నిర్వహించారనే కారణం చూపుతూ.. పోలీసులు రహస్యంగా కేసు నమోదు చేయడం దారుణమని ఖండించారు. ఇలా కేసులు పెట్టుకుంటూ.. పోతే.. ముందు.. ప్రభుత్వంపైనే కేసులు పెట్టాలని, కనీసం మాస్కులు కూడా ధరించని ముఖ్యమంత్రిపై నే కేసు పెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదేసమయంలో విశాఖలో దివ్యాంగులకు అండగా ఉన్న స్వచ్ఛంద సంస్థను రాత్రికి రాత్రి బలప్రయోగం ద్వారా కూల్చివేయడం దారుణమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సుమారు 70 మంది వరకు దివ్యాంగులు, మానసిక వికలాంగులైన చిన్నారులకు ఈ సంస్థ ఆశ్రయం కల్పిస్తోందని.. కేవలం లీజు సమయం ముగిసిందనే కారణం చూపి.. దీనిని కూల్చేసి.. చిన్నారులను రోడ్డు పాల్జేశారని.. చంద్రబాబు దుయ్యబట్టారు. జగన్‌కు ఒక్క చాన్స్ ఇచ్చింది.. ఇందుకేనా? అని బాబు నిలదీశారు.
https://twitter.com/JayapalReddyTDP/status/1401448236557029387