వీకెండ్ వస్తే… తెలుగు పాలిటిక్స్ లో ఆర్కే కొత్త పలుకు ఒక చర్చకు దారి తీస్తుంది. ప్రస్తుతం మీడియాల్లో అన్ని వార్తను కవర్ చేసే ఏకైక మెయిన్ మీడియా అని ఆంధ్రజ్యోతికి పేరు. చివరకు ఆంధ్రజ్యోతిని ఆడిపోసుకునే టీఆర్ఎస్, వైసీపీ నేతలు కూడా లోలోన ఆంధ్రజ్యోతి పేపర్ కు ఫ్యాన్సే. ఎందుకంటే పొలిటికల్ రిపోర్టింగ్ లో ఇప్పటికీ ఏకైక దిక్కు ఆంధ్రజ్యోతియే.
పొలిటికల్ ఇన్ సైట్స్ తో సంచలన విషయాలు వెల్లడిస్తు చర్చకు దారితీస్తుంటారు. షర్మిల పార్టీ గురించి మొట్టమొదట వెలుగులోకి తెచ్చింది కూడా ఆర్కేనే. తాజాగా ఆయన ఈ వీకెండ్ చేసిన సంచలన కామెంట్ తెలుగు రాష్ట్రాలను షేక్ చేసింది.
40 ఏళ్ల నుంచి జర్నలిజంలో ఉన్న రాధాకృష్ణకు సహజంగా తెలుగు నేతలు అందరి వ్యవహారాలు లోగుట్టులు తెలుసు. చివరకు వైసీపీలో కూడా ఆయనకు సమాచారం ఇచ్చేవారు ఉంటారు. అలా బయటకు వచ్చిన ఒక సంచలన విషయం ఈరోజు అందరికీ షాక్ ఇచ్చింది.
వైఎస్ జగన్ క్రిస్టియన్ ప్రతి ఒక్కరికి తెలుసు. ఏసును ప్రగాడంగా నమ్ముతారు. హిందువులు ఏడాదికి ఒకసారి తమ దేవుడి ఆలయానికి వెళ్తారో లేదో గాని జగన్ మాత్రం కచ్చితంగా ప్రతి ఏటా జెరూసలెం వెళ్తారని మనకు తెలిసిందే. అయితే, ఈ భక్తిలో ఆయన పీక్స్ లో ఉంటారని తాజాగా ఆర్కే కామెంట్ తో అందరికీ తెలుస్తోంది.
ఆర్కే వెల్లడంచిన సమాచారం ఏంటంటే… జగన్ ప్రతి రోజూ అర్ధరాత్రి 12 గంటలకు జీసస్‌తో మాట్లాడతారట. ఇది ఆయనే కొందరితో చెప్పారట. గత ఏడాది కరోనా వచ్చిన కొత్తలో అధికారులు వైరస్ ముప్పు గురించి ఆందోళన వ్యక్తం చేస్తే… తాను జీసస్ తో మాట్లాడాను అని, కరోనా ఏమీ ఉండదంటూ జగన్ వారితో చెప్పారట. ఆ మాట విని అధికారులు షాక్ కు గురయ్యారట.
మరో సంఘటనలో ఒక మాజీ ఐఏఎస్ అధికారి పదవీ విరమణ తర్వాత వైకాపాలో చేరుదామని జగన్‌ను కలిశారట. ఆ సందర్భంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో రోజూ రాత్రి పూట మాట్లాడతానని జగన్ తన దగ్గర అనడంతో ఆ అధికారి విస్తుపోయారట. ఆయన పార్టీలో కూడా చేరకుండా ఉండిపోయారట.
టోటల్ గా ఆర్కే చెప్పిన దాంట్లో జగన్ కు కొన్ని మానసిక సమస్యలు ఉన్నట్లు ధ్వనిస్తోంది.
సహజంగానే ఆర్కే కామెంట్ పై జగన్ అభిమానులు రెచ్చిపోయారు.