టీవీ షోల్లో ప్రోమోలు చూసి జనాలు ఏదో ఊహించేసుకోవడం.. ఆ ప్రోమోలు సోషల్ మీడియాలో వైరల్ అయి మీడియాలో వార్తలుగా మారాడం.. ఆ తర్వాత అసలు ఎపిసోడ్ వచ్చాక అదంతా ప్రోమోను వైరల్ చేయడానికి ఆడిన డ్రామా అని తేలడం.. కొన్నేళ్ల నుంచి నడుస్తున్న ట్రెండ్ ఇది. చివరికి ఈ ట్రెండులో యాంకర్ సుమ కూడా భాగం అయింది.
ఒక టీవీ షో ఎపిసోడ్లో సుమ చాలా ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంది. తాను యాంకరింగ్ మానేస్తున్నట్లుగా ఆమె అందులో పేర్కొంది. ఈ వీడియో వైరల్ అయి.. సుమ యాంకరింగ్ మానేయడం ఏంటనే చర్చ ఊపందుకుంది.
సుమకు ఏవో చర్మ సమస్యలు ఉన్నాయని, అవి అతి మేకప్ వల్ల వచ్చాయని.. దీంతో కొన్నాళ్ల పాటు మేకప్‌కు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకోవాలని సుమ ఫిక్సయిందని వార్తలు జోరందుకున్నాయి.
కానీ ఈ ఊహాగానాలకు సుమ చెక్ పెట్టింది. తాను యాంకరింగ్ మానేస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆమె ఖండించింది. తాను యాంకరింగ్‌కు దూరమయ్యే ప్రసక్తే లేదని తేల్చేసింది సుమ. నేను యాంకరింగ్ గుడ్ బై చెప్పబోతున్నాను అని వచ్చే విషయంలో ఎవరు కంగారు పడకండి. నేను కేవలం టీవీ కోసమే పుట్టాను. మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికే పుట్టాను. యాంకరింగ్ కి గుడ్ బై చెప్తానని మీరు ఎలా అనుకున్నారు. మీరు అందరూ హ్యాపీగా ఉండండి. నేను ఆ ఈవెంట్లో ఎమోషనల్ అయినా విషయం నిజమే.
కానీ అసలు విషయం ఏంటో మీకు పూర్తి ఎపిసోడ్ చూస్తే గాని అర్థం కాదు..అంటూ తనపై వస్తున్న వార్తలపై ఓ వీడియోలో క్లారిటీ ఇచ్చింది సుమ. కాబట్టి సుమ యాంకరింగ్ మానేస్తుందని ఆమె అభిమానులు కంగారు పడిపోవాల్సిన పని లేదన్నమాట. మరి సుమ తాను యాంకరింగ్‌కు టాటా చెబుతున్నట్లుగా సదరు ఎపిసోడ్లో ఎందుకు అందో చూడాలి.