#కందుకూరు సభలో విషాదం,
బహిరంగ సభని రద్దు చేసిన @ncbn గారు!
కన్నీరు పెట్టిస్తున్న బాబు గారి మాటలు 😓
(1/3) pic.twitter.com/p3OXHNdrUc— ᴍᴀɴᴀ ᴩʀᴀᴋᴀꜱᴀᴍ (@mana_Prakasam) December 28, 2022
కందుకూరులో చంద్రబాబు గారి సభలో అపశ్రుతి చోటు చేసుకుంది. సభకు వచ్చిన 8 మంది డ్రైనేజీలో పడి చనిపోయారు. కందుకూరులో జరుగుతున్న సభకు ఎవరూ ఊహించనంత పెద్ద సంఖ్యలో వేల మంది ప్రజలు, కార్యకర్తలు తరిలివచ్చారు. సభా ప్రాంగణంలో ప్రజలు పోతెడ్డడంతో, కార్యకర్తల మధ్య కొంచెం తోపులాట జరిగింది. దీంతో ఒక్కసారిగా పెద్ద కాలవలో సుమారు పది మంది కార్యకర్తలు పడి పోయారు.
ఆ కాలువ ప్రభుత్వ నిర్వహణ సరిగా లేక, మూత కూడా లేకపోవడం వల్ల గమనించని కొందరు అందులో పడిపోయారు. కందుకూరు పట్టణంలో సెంటర్ లోనే అలా ఉంటుందని ఎవరూ ఊహించక పోవటం వల్ల ఈ ప్రమాదం జరిగింది.
విషయం తెలుసుకున్న వెంటనే చంద్రబాబు తన ప్రసంగం ఆపేసారు. వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేయించారు. చంద్రబాబు కాన్వాయ్ లోని అంబులెన్సులో వారిని తరలించారు.
అంతే కాకుండా, కుటుంబ సభ్యులను పరామర్శించడానికి, గాయపడిన వారి గురించి తెలుసుకోవటానికి, చంద్రబాబు నేరుగా హాస్పిటల్ కు వెళ్లారు. చాలా సేపు అక్కడే ఉండి పరిస్థితి సమీక్షించారు. చనిపోయిన కుటుంబాలకు పార్టీ తరుపున రూ.10 లక్షలు ప్రకటించారు.
అలాగే గాయపడిన వారిని ఆదుకుంటామని, వారి పిల్లలని ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ లో చదివిస్తామని హామీ ఇచ్చారు. సభా ప్రాంగణంలో వారికి నివాళులు అర్పించి, మీటింగ్ రద్దు చేసారు.
అక్కడ కాలవ ఉన్నది జాగ్రత్త ఉండండి ప్లీజ్ ప్లీజ్ అని ముందే హెచ్చరించిన కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ . ఇంటూరి నాగేశ్వరావు గారు. pic.twitter.com/pcekobyF0g
— iTDP Nellore Parliament (@iTDP_NellorePC) December 28, 2022
కందుకూరు సభలో మృతి చెందిన 7 గురు మృతుల వివరాలు
దేవినేని రవీంద్ర (ఆత్మకూరు)
యటగిరి విజయ (ఉలవపాడు )
కలవకూరి యానాది (కొందమూడుసు పాలెం )
రాజా (కందుకూరు )
చిన కొండయ్య (అమ్మపాలెం )
పురుషోత్తం (కందుకూరు )
రామయ్య (గుల్ల పాలెం )— 𝐒𝐡𝐚𝐢𝐝𝐝𝐢𝐧™ 𝐓𝐚𝐫𝐚𝐤𝐢𝐚𝐧💎 (@SShaiddin_NTR) December 28, 2022