అనసూయ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. గ్లామరస్ యాంకర్‌గా వెలిగిన అనుసూయ తరచూ హాట్ ఫొటో షూట్లతో నెట్టింట సందడి చేస్తుంటారు. అలాంటి అనసూయ ఇటీవల గ్లామర్ షోకు చాలా దూరం పాటిస్తున్నారు. తాను ఎలాంటి మేకప్ లేకుండా చాలా సాధారణంగా ఉండే ఫొటోలనే ఈ మధ్య కాలంలో పోస్టు చేస్తున్నారు. అనసూయలో వచ్చిన ఈ మార్పుకు కారణమేంటనే చర్చ ఇప్పుడు సినీ సర్కిళ్లలో జోరుగా సాగుతోంది.
మొదట్లో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నట జీవితాన్ని ఆరంభించిన అనసూయ తరువాత బుల్లితెరపై యాంకరింగ్ మొదలెట్టి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను సాధించుకున్నారు. గ్లామర్ యాంకర్‌గా ఆమె తెలుగు టీవీల్లో బుల్లితెరను ఏలారు. ఈటీవీలో వచ్చే జబర్దస్త్ కార్యక్రమానికి ఆమె చాలా కాలం పాటు యాంకర్‌గా పనిచేసి తన అందచందాలతో తన వాక్చాతుర్యంతో ఆ ప్రదర్శనకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పలు ఈవెంటర్లకు కూడా ఆమె యాంకర్‌గా రాణించి ఇటీవల పూర్తి స్థాయి సినిమాల్లో నటించడానికి దృష్టి సారించారు.
ఇటీవల సూపర్ హిట్ కొట్టిన సుకుమార్ అల్లు అర్జున్ సినిమా పుష్పలో ఆమె దాక్షాయణి పాత్రలో మెరిసి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. సినిమాల్లో ఆమెకు వరుస అవకాశాలు తట్టుతుండటంతో ఆమె ఇటీవల జబర్దస్త్ కార్యక్రమం నుంచీ కూడా నిష్క్రమించారు. అయితే తరచూ అనసూయ గ్లామర్ ఫొటో షూట్లు చేస్తూ అందులో తన సోయగాలను ప్రదర్శిస్తూ ఆ ఫొటోలను సామాజిక మాద్యమంలో పోస్టు చేస్తూ కుర్రకారకు మతిపొగొట్టేవారు.
కానీ ఇటీవల అనుసూయ పంథాలో మార్పు కనిపిస్తోంది. ఆమె నుంచీ ఇటీవల గ్లామర్ ఫొటో షూట్ ఫొటోలేవీ రావడం లేదు. అనసూయ తన సోషల్ మీడియా అకౌంట్లలో అలాంటి ఫొటోలు పోస్టు చేయడం లేదు. ఎలాంటి మేకప్ లేకుండా చాలా సాధారణంగా ఉంటున్న ఫొటోలనే ఆమె పోస్టు చేస్తున్నారు. చాలా సంప్రదాయబద్దమైన దుస్తుల్లో ఉండే ఫొటోలను కూడా షేర్ చేస్తున్నారు. అలాగే ఆమె బుల్లితెరపై ఎలాంటి టీవీ షోలు కూడా చేయడం లేదు. ఒకవేళ ఎక్కడైనా ఒకటి రెండు చోట్ల కనిపించినా ఆ కార్యక్రమం జడ్జీగా మాత్రమే కనిపించారు. ఈవెంట్లను కూడా ఆమె బాగా తగ్గించుకున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
అనసూయలో వచ్చిన ఈ మార్పునకు కారణమేంటనేది సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 సినిమాతో పాటు పలు సినిమాలకు ఒప్పుకొన్నట్లు సమాచారం. ఇకపై పూర్తీగా సినిమాలకే సమయం కేటాంయించాలనే నిర్ణయంతో ఆమె సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటో షూట్లకు కూడా కొంత దూరం పాటిస్తున్నట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి.