సెలబ్రిటీలకు ఉండే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఇక.. సోషల్ మీడియాలో చెప్పాల్సిన అవసరం లేదు. అనసూయ కు అయితే… ఇవి మరీ ఎక్కువ. మర్యాదగా మాట్లాడేవారు కొందరైతే.. చిలిపిగా పలుకరించేవారు.. ఆగ్రహంతో విరుచుకుపడేవారు.. మనసు నొచ్చుకునేలా మాట్లాడేటోళ్లు.. ఇలా రకరకాల వారు ఉంటారు. కొన్నిసార్లు విషయం ఎంత పాజిటివ్ గా ఉంటుందో.. మరికొన్ని సార్లు అంతకు రెట్టింపు నెగిటివ్ గా ఉంటుంది. విడిగా ఉన్నప్పుడు పరిస్థితుల్ని ఎలా ఎదుర్కొవాలనే దానికి మించిన రీతిలో సోషల్ మీడియాలో దేనికి ఎలా రియాక్టు కావాలన్నది చాలా ముఖ్యం.
ఈ విషయంలో సెలబ్రిటీలు పలువురు చేసే తప్పులు వారిని తెగ ఇబ్బంది పెడుతుంటాయి. దీంతో వారు హర్ట్ అయి ఆవేశానికి దిగితే లాభం కంటే నష్టమే ఎక్కువ. అన్నింటికి మించి.. రూల్ బుక్ లో మాదిరి.. మన మనసులో ఉన్నట్లుగా అందరు తమను గౌరవించాలి.. అభిమానించాలి.. ఆరాధించాలని అనుకోవటం అత్యాశే ఉంటుంది. అందుకు.. కాస్తంత ప్రాక్టికల్ గా వ్యవహరిస్తూ.. సెన్సాఫ్ హ్యూమర్ తో రియాక్టు కావటం తప్పనిసరి. ఈ విషయంలో ప్రముఖ యాంకర్ అనసూయ కాస్తంత వెనుకబడి ఉంటారని చెప్పాలి.
తనను విమర్శించే వారిని.. వేలెత్తి చూపే వారి విషయంలో ఆమె కరకుగా రియాక్టు అవుతుంటారు. అదే సమయంలో ఆమె చేసే ఉపదేశాలకు.. ఆమె తీరుకు పొంతన ఉండకపోవటంతో.. ఆమె పేరు తరచూ ఏదో ఒక ఇష్యూలో నానుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితికి భిన్నంగా ఉండాలన్న ఆలోచన అనసూయకు ఉంటే.. బాలీవుడ్ బ్యూటీ.. టాలీవుడ్ సీతగా యూత్ మనసుల్ని దోచేసిన మ్రణాళిని ఠాకూర్ ను చూసి నేర్చుకోమంటున్నారు. తాజాగా అమ్మడి సోషల్ మీడియా ఖాతాలో ఒక ఫ్యాన్ ఆమెకు పెళ్లి ప్రపోజల్ పెట్టాడు.
‘‘మిమ్మల్ని పెళ్లి చేసుకోవటానికి నా వైపు నుంచి ఓకే’’ అంటూ పోస్టు పెట్టాడు. దీనికి స్పందించిన ఆమె.. ‘‘నా వైపు నుంచి ఓకే కాదుగా.. ’’ అంటూ స్మైలీ ఎమోజీని పోస్టు చేశారు. దీంతో.. వీరి సంభాషణ నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తుంది. ఇక్కడ చెప్పేదేమంటే.. అభిమానులు అన్న తర్వాత రకరకాలుగా ఉంటారు. వారు పెట్టే పోస్టులకు దేనికి రియాక్టు కావాలి? దేనికి కావొద్దు? రియాక్టు అయితే ఎలా ఉండాలన్న విషయంపై కాస్తంత హోంవర్కు చేయాల్సిన అవసరం టాలీవుడ్ సీతను చూస్తే అర్థమవుతుంది. మరి.. ఈ విషయాన్ని అనసూయ కూడా గుర్తిస్తే.. ఆమె సమస్యకు పరిష్కారం దొరికినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.