విదేశీ నేల పై తెలుగు సాంస్కృతిక పరిమళాలు విరబూశాయి. ఇక్కడి నుంచి వెళ్లిన కళాకారుల నృత్య ప్రదర్శనలు ఆటా వేడుకలకే ఆకర్షణీయంగా నిలిచాయి. ప్రధానంగా భారతీయ నృత్య వైభవాన్ని చాటాయి. అదేవిధంగా వేడుకల్లో భాగంగా తొలి రోజు గాయకులు సునీత, రామ్ మిరియాల, మంగ్లీ ఆలపించిన గీతాలు ఇక్కడి వారిని ఉర్రూత లూగించాయి.
14 రంగాల్లో విశేష ప్రతిభ చాటిన వారికి ఆటా అవార్డులను ఈ వేదికపై బహూకరించారు. వాషింగ్టన్ డీసీలో జరుగుతున్న ఆటా వేడుకలకు సంబంధించి, అక్కడ నిర్వహిస్తున్న 17 వ జాతీయ మహా సభలకు సంబంధించిన విశేషాలివి..
ఆటా వేడుకల్లో తొలి రోజు సినీ సంగీత నేపథ్య గాయకులు ఉర్రూత లూగించగా రెండోరోజు ప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసు దేవ్ అతిథిగా విచ్చేసి, నేలను పరిరక్షించుకోవడం, మట్టిని కాపాడుకోవడం, ప్రకృతిని కాపాడుకోవడం వంటి విషయాలకు ఉన్న ప్రాధాన్యం వివరించి ఆకట్టుకున్నారు.
వాతావరణంలో వచ్చే మార్పులను., సంబంధిత నష్టాలను నివారించడం కోసం మనం అందరం మట్టిని కాపాడుకోవాలని అన్నారు. మనుషులు పరిసరాలనే కాదు మనస్సులూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. ఇదే వేదికపై విఖ్యాత అపోలో సంస్థల నిర్వాహకురాలు ఉపాసన కామినేని కూడా మాట్లాడారు.
జన్మభూమి అభివృద్ధిలో, ఆరోగ్య సంబంధ కార్యక్రమాల్లో అందరూ భాగం పంచుకోవాలని పిలుపునిచ్చారు. సభికులకు ఆటా అధ్యక్షులు భువనేశ్ భుజాల, కన్వీనర్ బండారు సుధీర్ ఆహ్వానం పలికారు. ఎమ్మెల్సీ కవిత, హీరో అడవిశేష్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్, ఎంపీ నిరంజన్ రెడ్డి ఇంకా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు వేడుకకు ఆకర్షణీయంగా నిలిచారు. అనంతరం సినీ దర్శకుడు తమన్ సంగీత విభావరి సభికులను ఉర్రూతలూగించింది.
Proud to welcome the 17th Annual American Telugu Association Conference to the nation’s capital!
Indian and Asian Americans help weave the beautiful tapestry that is DC’s diversity, and I look forward to the exchange of culture and community that will take place this weekend. pic.twitter.com/FWQgdGFY45
— Mayor Muriel Bowser (@MayorBowser) July 2, 2022
Very Happy to be a part of the opening ceremony of Telangana State Pavillion at American Telugu Association inaugurated by @RaoKavitha akka garu in Washington D.C. @KTRTRS #TelanganaStatePavillion @mbigala @trspartyonline @TelanganaCMO @ataworld @OfficeOfKavitha pic.twitter.com/CzAnBGhDFi
— Uppala Srinivas Gupta (@USrinivasGupta) July 3, 2022
Addressed the inaugural session of American #Telugu Association Convention in #WashingtonDC. Vibrant colours & culture of #India in display. Compliments-Vande Bharatam troupe
Underlined the role of Telugu community in deepening ???????????????? ties. pic.twitter.com/7DYb3FKusr
— Taranjit Singh Sandhu (ਮੋਦੀ ਦਾ ਪਰਿਵਾਰ) (@SandhuTaranjitS) July 2, 2022
Radio Nyra exclusively presents to you a glimpse of American Telugu Association – 17th #ATA Convention and Youth Conference at Walter E. Washington Convention Center.✨ #WashingtonDC #RaleighNC #Community #AmericanTeluguAssociation #Telugu #Convention #YouthConference #DC pic.twitter.com/pTmd2GMJ77
— RadioNyra USA (@NyraUsa) July 2, 2022