ఇద్దరు యువకులు అమీర్ పేటలో యాక్సిడెంట్ కు గురయ్యారు. వేగం వారి ప్రాణం తీసింది. అయితే, ఎపుడూ జరిగే ప్రమాదాలకు చాలా భిన్నంగా జరిగింది ఈ ప్రమాదం. వారు వెళ్తున్న వేగానికి బైకు అదుపు తప్పగా ఇద్దరు ఎగిరి పడ్డారు. ఒకరు రోడ్డు మీద పడగా… మరొకరు రెయిలింగ్ పై పడ్డారు.
రెయిలింగ్ పై పడిన వ్యక్తి తల అందులోనే ఇరుక్కుపోయింది. సాధారణంగా తలదూర్చేంత గ్యాప్ ఉన్న రెయిలింగ్ కాదు అది. అయినా వారు వెళ్తున్న వేగానికి కడ్డీ బెండ్ అయ్యి తలదూర్చాక అది యతా తథ స్థితికి చేరుకుంది. దీన్నిబట్టి వారు ఎంత వేగంగా వెళ్తున్నదీ అర్థమవుతోంది.
చనిపోయిన యువకుడు శ్రీకాకుళం వాసి. పేరు గిరీష్ గుప్తా. నివాసం కేపీహెచ్బీ. అతని స్నేహితుడు రవితేజ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉస్మానియా వైద్యులు రవితేజ పరిస్థితి విషమంగా ఉందని తేల్చారు. చనిపోయిన గుప్తా తలను బయటకు తీయడానికి గ్యాస్ కట్టర్ తో రెయిలింగ్ కట్ చేయాల్సి వచ్చింది. పంజాగుట్ట పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.