లాక్కున్న కొంప గృహప్రవేశం ఎపుడు? - సాయిరెడ్డిపై బుద్ధా సెటైర్
ఏపీలో రాజకీయాలు అధికార ప్రతిపక్షాల మాటల తూటాలతో వేడెక్కుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ వేస్తున్న ప్రశ్నలకు సమాధానం దొరకనపుడల్లా అధికార పార్టీ నేతలు ఇరుకున పడుతున్నారు. బూతులతో మీడియాకు ఎక్కుతున్నారు.
వయసు, హోదా, సంస్కారం అనేవి చూడకుండా బూతులతో దాడి చేస్తున్నారు. ఇక అధినాయకుడు, ఉప నాయకుడు అయిన జగన్, విజయసాయిరెడ్డిలు తాము అవినీతి కేసుల్లో జైలుకు తరచు హాజరవుతు చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడుతున్నారు. దానికి సరైన కౌంటరుతో తెలుగుదేశం నేతలు రివర్స్ అటాక్ చేస్తున్నారు.
తాజాగా సచివాలయం చదరపు అడుగుకు 3500 ఖర్చుపెట్టారంటూ విజయసాయిరెడ్డి వేసిన అసందర్భ ట్వీట్ కు బుద్ధావెంకన్న ఘాటుగా బదులిచ్చారు. ఆయన ఏం రిప్లై ఇచ్చారో ఆయన మాటల్లో వింటనే బెటర్
అమరావతి గురించి 18 నెలలుగా ఆలోచించి నీకు,నీ అల్లుడు కి బట్టతల రావడం తప్ప ఒక్క రూపాయి అవినీతి చూపించలేక చతికల పడ్డారు.కుంభకోణాలు గురించే నువ్వు చెప్పాలి, ఏపి ప్రజలు వినాలి. మధ్య తరగతి ప్రజలే, చ.అకి రూ.1500 వరకు ఖర్చు పెడుతుంటే,(1/3)
— Budda Venkanna #StayHomeSaveLives (@BuddaVenkanna) December 11, 2020
మొన్నా మధ్య వైజాగ్ లో మంచి ప్యాలెస్ బెదిరించి లాక్కున్నావ్ అంటగా, ఎప్పుడు కాపురం పెడుతున్నావ్, కొట్టేసిన కొంపలో?(3/3)
— Budda Venkanna #StayHomeSaveLives (@BuddaVenkanna) December 11, 2020
పోకిరి సినిమా స్టైల్లో కౌంటర్ వేసిన బుద్ధా వెంకన్నకు మళ్లీ విజయసాయిరెడ్డి నుంచి ఏం రిప్లై వస్తుందో చూడాలి మరి.