వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గట్టి సవాల్ రువ్వారు. `నీ ప్రభుత్వంలో దళితులకు ఏం చేశావో చెప్పు“ అంటూ సవాలు రువ్వారు. రాష్ట్ర విభజనతో జరిగిన నష్టం కంటే జగన్ పాలనలో జరుగుతున్న నష్టం ఎక్కువ అని విమర్శించారు. వైసీపీ పాలనలో క్రైస్తవులకు, దళిత వర్గాలకు తీరని అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. ఎస్సీలకు టీడీపీ ఉచిత విద్యుత్ పథకం పెడితే.. దానిని జగన్ నిర్వీర్యం చేశాడని మండిపడ్డారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగాయని తెలిపారు.
నాడు ముద్దులు- నేడు గుద్దులు
పాము తన గుడ్లు తాను తిన్నట్టు.. తనకు ఓట్లేసిన వారి పైనే జగన్ ప్రభుత్వం దాడులు చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. పాదయాత్రలో ముద్దులు పెట్టిన జగన్.. ఇప్పుడు అందర్నీ పిడిగుద్దులు గుద్దినట్టే.. ఎస్సీలను గుద్దుతున్నాడని మండిపడ్డారు. వైసీపీ దళిత వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. దళిత కుటుంబాల్లో ఒకరికే అమ్మ ఒడి ఇస్తున్నారని ఆక్షేపించారు. అన్ని కులాలకంటే ఎక్కువ పేదరికం ఎస్సీల్లోనే ఉందన్నారు. ఎస్సీలకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని తాను పథకం పెడితే.. దాన్ని జగన్ నిర్వీర్యం చేశాడని దుయ్యబట్టారు.
విద్యుత్ ధరలు పెంచి ఎస్సీలపై భారం మోపాడని మండిపడ్డారు. చరిత్రలో దళితులపై ఎప్పుడూ జరగనన్ని దాడులు ఇప్పుడే జరుగుతున్నాయని అక్షేపించారు. అంబేద్కర్ ఆనాడే దళితులపై దాడులు ఈ స్థాయిలో జరుగుతాయని ఆలోచన చేస్తే.. దళితులపై దాడులు చేసిన వారిని ఉరేయాలని చట్టం చేసేవారన్నారు. దళిత డాక్టర్ మొదలుకుని.. దళిత డ్రైవర్ వరకు అందరూ వైసీపీ ప్రభుత్వ దాష్టీకాలను ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులు భరించలేక ఎస్సీ అధికారి అచ్చెన్న చనిపోతే.. సీఎం జగన్ ఎందుకు నోరు మెదపలేదని చంద్రబాబు నిలదీశారు.
అంబేద్కర్‌కు భారత రత్న రావడం వెనుక ఎన్టీఆర్!
కృష్ణా జిల్లా గుడివాడలో చంద్రబాబు నేతృత్వంలో అంబేద్కర్ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సంఘాలు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఎన్టీఆరే.. అంబేద్కర్‌కు నిజమైన వారసుడని తెలిపారు. ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్ గా ఉన్నప్పుడే నాటి కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్‌కు భారత రత్న ప్రకటించిందని గుర్తు చేశారు. దీని వెనుక ఎన్టీఆర్ ఉన్నారని తెలిపారు. దళితుడైన కేఆర్ నారాయణన్‌ను రాష్ట్రపతిగా గెలిపించింది టీడీపీనేనని గుర్తు చేశారు. బాలయోగిని లోక్ సభ స్పీకరుగా చేశామన్నారు. కాకి మాధవరావుని సీఎస్ గా చేసిన ఘనత టీడీపీ దే అని తెలిపారు.
నూజివీడులో ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం…..
నూజివీడు పట్టణంలో చంద్రబాబు రోడ్ షో…
చంద్రబాబు రోడ్ షోకు భారీగా తరలివచ్చిన ప్రజలు టిడిపి నాయకులు మరియు కార్యకర్తలు……#IdemKarmaRastraniki#HOPEJETTI pic.twitter.com/y66heDKzCy
— Cbnforap (@Cbnforap1) April 14, 2023