ఏపీలో అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీల మధ్య విమర్శలు.. ప్రతివిమర్శలు కామనే. అయితే.. వైసీ పీ నేతలు… అధికారం చూసుకునో, లేక.. తమకే అంత మందబలం ఉందని భావించో.. టీడీపీపై విరుచుకు పడుతున్నారు. వెంట్రుకలు పీకలేరు.. ఆడు.. ఈడు.. అంటూ.. వినలేని భాషను ప్రయోగిస్తున్నారు. సభ్య సమాజం సిగ్గుపడుతోందని తెలిసినా.. అధికారంలో ఉన్నా.. నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని.. ధ్యాస ఉన్నా.. వీటన్నింటినీ .. పక్కన పెట్టి.. బూతులతో విరుచుకుపడుతున్నారు.
గతంలో మంత్రిగా ఉన్న కొడాలి నాని.. నోరు విప్పితే.. `అమ్మనా..` భాష వినిపించేంది. ఎవరినైనా ఏకవచ నంతో సంబోధించడం.. ఆడు.. ఈడు.. నా కొ..క అంటూ.. విరుచుకుపడడం.. అమ్మామొగుడు.. అంటూ తీవ్రమైన కామెంట్లు చేయడం.. వంటివి పరిపాటిగా మారింది. అయితే.. వీటికి కౌంటర్ ఇచ్చేందుకు.. ఇంతలా బరితెగించి మాట్లాడేందుకు టీడీపీ నేతలు… తటపటాయిస్తున్న విషయం తెలిసిందే. “మేం కూడా మాట్లాడగలం.. కానీ.. సభ్యత, సంస్కారం అడ్డు వస్తోంది!“ అంటూ.. సాక్షాత్తూ.. చంద్రబాబే పలు సందర్భాల్లో చెప్పారు.
దీంతో ఇతర నేతలు కూడా.. బాబు బాటలోనే నడుస్తూ.. వైసీపీ నుంచి ఎలాంటి విమర్శలు వచ్చినా.. బూతులు వచ్చినా.. తమదైన శైలిలో స్పందిస్తున్నారే తప్ప.. ఎక్కడా `లక్ష్మణ రేఖ`లు దాటలేదు. బహుశ ఇదే అధికార పార్టీ నేతలకు అలుసుగా మారిందేమో.. అందుకే.. ఎంత నీచ భాష మాట్లాడితే.. అంత మంచిదని అనుకున్నారో.. లేక.. ఏం మాట్లాడినా.. టీడీపీ నేతలు ఏమీ అనరులే అనుకున్నారో.. మొత్తానికి బూతుల భాషను కొనసాగిస్తూనే ఉన్నారు. నాయకులు ఎవరైనా.. వారి స్థాయి ఏదైనా.. టీడీపీపై బూతులతోనే విరుచుకుపడుతున్నారు.
అయితే.. ఎన్నాళ్లు ఇలా.. అధికారపార్టీ నేతలతో బూతులు తిట్టించుకున్నాం.. అనుకున్నారో.. తెలియదు కానీ.. మాజీ మంత్రి, విశాఖ జిల్లా నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యేసీనియర్ నేత.. చింతకాయల అయ్యన్నపా త్రుడు కూడా తన శైలి మార్చుకున్నారు. ముల్లును ముల్లుతోనే తీయాలనే సూత్రాన్ని ఒంటబట్టించుకు న్నారు. అందుకే ఇటీవల కాలంలో ఆయన కూడా “వైసీపీ నేతల“ భాషలోనే వారికి సమాధానం చెబుతున్నారు. అదే భాషలో ప్రశ్నలు సంధిస్తున్నారు. వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.
ముఖ్యంగా జలవనరుల మంత్రి అంబటి రాంబాబుపై… అయ్యన్న సంధిస్తున్న పదునైన విమర్శలతో వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి గురవుతున్నారు. రాంబాబును `కాంబాబు` అంటూ.. అయ్యన్న ఆటపట్టిస్తున్నారు. మంత్రి అంబటి కాం(రాం)బాబు సంస్కార హీనుడు అంటూ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. తెల్లచొక్కా వేసి కళ్లజోడు పెట్టినంత మాత్రాన కామాంధులు సంస్కారవంతులు కాలేరని ఆరోపించారు.
హైదరాబాద్‌లోని ఓ టీవీ ఛానల్ వెనక రాసలీలల గెస్ట్ హౌస్ నుంచి.. విజయవాడ హనీ గెస్ట్‌హౌస్ వరకూ కాంబాబు కామచరిత్ర బయటకు వస్తోందని అయ్యన్న ఆరోపించారు. ఇంకా ఉడత ఊపులు ఎందుకు కాంబాబు? అంటూ అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. ఒక యాంకర్ అని నేను మెసేజ్ పెడితే అంబటి, అతని మనుషులు.. ఆరుగురికి ఫోన్లు చేసి తప్పైందని, మెసేజ్‌లు డిలీట్ చేయాలని కోరారని అయ్యన్న అన్నారు.
అరేయ్ కాంబాబు నీ బూతు పురాణం సిఎం కి చేరింది. భర్తరఫ్ చేస్తారో అన్ని తెలిసే కదా ఈ బోగ్గాడికి పదవి ఇచ్చాం అనుకుంటారో వాళ్ళ ఇష్టం. ఎవరెవరికి మెసేజ్ చేశావో నీకు తెలిసి కూడా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడం అది నా వాయిస్ కాదు…నా మెసేజ్ కాదు అనడం కామనే గా !. @AyyannaPatruduC pic.twitter.com/0aSz4O9CBE
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) May 15, 2022
నీ కూతురు వయస్సు ఉన్న అమ్మాయికి అసభ్యకరమైన మెసేజ్ లు పంపడం ఎంటి కాంబాబు.. @AmbatiRambabu pic.twitter.com/zFNj4GDGt7
— Kalava Srinivasulu (@KalavaTDP) May 15, 2022
ఈ పరిణామాలు.. వైసీపీలో ఉక్కబోతకు గురి చేస్తున్నాయి. వైసీపీ నేతలు.. ఇప్పటి వరకు టీడీపీలో ఎవరూ తమతో సరితూగే వారు లేరని భావించినా..ఇప్పుడు వారికి మాజీ మంత్రి అయ్యన్న రంకుమొగుడిలా తగులుకున్నారనే వాదన వినిపిస్తోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా బ్లాక్ మెయిల్ చేసినా తగ్గకుండా ఏపీ మంత్రిని చెడుగుడు ఆడుకుంటున్న అయ్యన్న తీరు చూసి వైసీపీకి గుండెపోటు తప్పడం లేదని అంటున్నారు విశ్లేషకులు.
టీడీపీ ని బూతులు తిట్టట్లేదని జగన్ ఫీల్ అవుతున్నాడంట – ఇది జగన్ ఆఫీస్ లో సోఫా కింద నుంచి చూసిన YSRCP వాళ్లే చెప్తున్నారేమో ? https://t.co/5yymlzv2Ez pic.twitter.com/Of1176WHBY
— Eclector (@eclector1419857) May 9, 2022