ఓ వైపు ఏపీ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపంసహారించుకుందని హైకోర్టుకు చెప్పారు. అమరావతి రైతులతో పాటు అమరావతికి మద్దతుగా మాట్లాడిన నేతలు, టీడీపీ, జనసేన పార్టీల నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. అమరావతి రైతుల ఉద్యమంపై వెనక్కి తగ్గిన జగన్ మూడు రాజధానులను రద్దు చేశారని వాళ్లు చెప్పుకుంటున్నారు.
అయితే ఇంతలోనే ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరు ట్విస్ట్ ఇస్తున్నారు. జగన్‌కు కుడిభుజం లాంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బిగ్ షాక్ ఇచ్చారు. ఇది ఇంటర్వెల్ మాత్రమే.. క్లైమాక్స్ వేరే ఉంటుందని బాంబు పేల్చారు.
ఈ ప్రకటన వచ్చిన వెంటనే చిత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానుల బిల్లు చట్టం ఉపసంహరణ ఇంటర్వెల్ మాత్రమే.. అని శుభం కార్డుకు మరింత సమయం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం టెక్నికల్‌గా ఉన్న కొన్ని సమస్యలు పరిష్కరించుకునేందుకే తాము హైకోర్టులో అఫిడవిట్ వేశాం అని చెప్పారు. తాను ఇప్పటకీ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నానని కూడా ఆయన తేల్చి చెప్పారు.
ఇక మూడు రాజధానుల బిల్లు ఉపంసహరణ అమరావతి రైతుల విజయం ఎంత మాత్రం కాదని ఆయన కొట్టిపడేశారు. అమరావతి రైతుల పాదయాత్ర ఏమైనా లక్షమందితో సాగుతుందా ? ఆ పాదయాత్ర చూసి తాము చట్టం ఉపసంహరించుకోలేదని.. అమరావతి రైతుల పాదయాత్ర..
పెయిడ్ ఆర్టిస్టుల పాదయాత్ర అని పెద్దిరెడ్డి ఘాటుగా స్పందించారు. ఏదేమైనా పెద్దిరెడ్డి వ్యాఖ్యలు చూస్తే ఏపీ రాజధాని విషయంలో వైసీపీ నిర్ణయాన్ని నమ్మలేని పరిస్థితి.
మళ్లీ మార్పులు, చేర్పులతో అయినా మూడు రాజధానులే ఉంటాయా ? అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న న్యాపరమైన అడ్డంకులను తొలగించి కొత్త బిల్లు వస్తుందని అంటున్నారు. ఏం జరుగుతుందో ? చూడాలి.