అమరావతిలో ఏ స్కాము లేదని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసిన తర్వాత ఏపీ సర్కారుకు ఏం చేయాలో తోచక ఏదేదో చేస్తోంది. ఈ పిటిషను ఉపసంహరించుకుంటాం దయచేసి అనుమతించండి అంటూ బతిమలాడి పిటిషను వెనక్కు తీసుకుంది.
ఇది అమరావతి భూముల కేసులో కీలక మలుపు అనుకోవచ్చు. ఎందుకంటే ఏపీ రాజధాని భూముల క్రయవిక్రయాలకు సంబంధించి హైకోర్టులో దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను ఏపీ సర్కార్ వెనక్కు తీసుకుంది అంటే దానర్థం మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలు సగానికి సగం తగ్గిపోయినట్లే.
ఇపుడు హైకోర్టులోనే అమరావతి భూముల ఇన్సైడర్ ట్రేడింగ్ గురించిన పిటిషను వెనుక్కు తీసుకోవడంతో ఇన్ సైడర్ స్కాం కథ చాలా వరకు ముగిసినట్లే.
హైకోర్టును తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం సమర్థించడంతో జగన్ సర్కారుకు ఏమీ పాలుపోవడం లేదు. ఇంత జరుగుతున్న జగన్ సర్కారు మళ్లీ మళ్లీ కోర్టులకు పోవడానికి కారణం… ఒక వర్గానికి కోర్టులపై ద్వేషం పెంచే ఉద్దేశమే.
ఆ సంగతి పక్కన పెడితే ఈ వ్యవహారంలో హైకోర్టులో దాఖలు చేసిన అప్పీ్ల్ పిటిషన్‌ను ప్రభుత్వం గురువారం వెనక్కి తీసుకుంది. అడ్వకేట్ జనరల్‌గా ఉన్న సమయంలో దమ్మాలపాటి శ్రీనివాస్ రాజధాని ప్రాంతంలో ముందస్తు సమాచారంతో భూములు కొనుగోలు చేశారని ఏసీబీ ఆయనపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై హైకోర్టు గాగ్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హైకోర్టు ఆదేశాలపై గతేడాది నవంబర్‌లో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్కడ కూడా హైకోర్టు తీర్పు కరెక్టే అనడంతో తన అప్పీల్‌ను వెనక్కు తీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.
మొత్తానికి ఏదో విధంగా అమరావతిపై కక్ష తీర్చుకోవడమే లక్ష్యంగా అనేక రకాలుగా వైసీపీ పావులు కదుపుతోంది. మరి చివరకు ఏం జరుగుతందో. అపుడే జగన్ పాలన సగం అయిపోయింది. ఇక మహా అయితే రెండేళ్లే. మిగతా సమయం ఎన్నికల హడావుడితోనే గడిచిపోతుంది.