ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. మెగా మరియు అల్లు ఫ్యామిలీల మధ్య చిలుక ఏర్పడిందనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతుంది. ఈ ప్రచారం నిజమే అన్నట్లుగా అల్లు అర్జున్ వ్యవహరిస్తున్నాడు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు మెగా ఫ్యామిలీ మొత్తం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా నిలబడింది. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి వెళ్లి మెగా ఫ్యామిలీ మెంబర్స్ ప్రచారం కూడా చేశారు.
కానీ ఒక్క అల్లు అర్జున్ మాత్రం ఎన్నికల ప్రచార సమయంలో నంద్యాల వెళ్లి తన స్నేహితుడు అంటూ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డికి మద్దతు తెలిపాడు. ఇది వివాదానికి కారణమైంది. అప్పటినుంచి మెగా ఫాన్స్ కి అల్లు అర్జున్ టార్గెట్ అయ్యాడు. ఎన్నికల ఫలితాల తర్వాత అల్లు అర్జున్ పై నెగిటివ్ మరింత పెరిగిపోయింది. ప్రతి చిన్న విషయానికి ఆయన్ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. పుష్ప 2 మూవీని బాయ్ కాట్ చేస్తామంటూ కూడా హెచ్చరిస్తున్నారు.
గత కొంతకాలం నుంచి అల్లు అర్జున్ పుష్ప 2 మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 1 పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని నమోదు చేసింది. అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది. దీంతో పుష్ప 2 ను డైరెక్టర్ సుకుమార్ మరింత గ్రిప్పింగ్ గా తెరకెక్కిస్తున్నారు. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 15న గ్రాండ్ రిలీజ్ చేయాలని భావించారు. రిలీజ్ డేట్ కూడా ప్రకటించాడు. కానీ ఇప్పుడు ఆ తేదీకి సినిమా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. పుష్ప 2 విడుదల వాయిదా ఖాయమే అన్నట్లుగా అల్లు అర్జున్ టీమ్ సైతం తాజాగా హింట్ ఇచ్చింది.
ప్రస్తుతం అల్లు అర్జున్ పై ఉన్న నెగటివిటీ కారణంగా పుష్ప 2 రిలీజ్ ను పోస్ట్ పోన్ చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారట. ఒక హీరో పట్ల వ్యతిరేకత ఉంటే ఏం జరుగుతుందో బాలీవుడ్ లో లాల్ సింగ్ చడ్డా లాంటి కొన్ని సినిమాలు ఉదాహరణగా ఉన్నాయి. అటువంటి పరిస్థితి పుష్ప 2కు రాకూడదని.. కొన్ని నెలలు ఆగితే అన్నీ సర్ధుకుంటాయని ప్రొడ్యూసర్స్ భావిస్తున్నారట.
ఇక మరోవైపు సన్ పిక్చర్స్, గీతా ఆర్ట్స్ సంయుక్త నిర్మాణంలో అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ కాంబోలో ఒక సినిమా పట్టాలెక్కాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. అట్లీ దాదాపు రూ. 80 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం వల్ల సన్ పిక్చర్స్ వారు అందుకు నిరాకరించారట. దాంతో అల్లు అర్జున్, అట్లీ సినిమా రద్దు అయిందనే వార్తలు నెట్టింట షికార్లు చేస్తున్నాయి.