స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ క్యూట్ స్టార్ అనిపించుకుంటోంది. గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న శాకుంతలం అనే చిత్రంలో అల్లు అర్హ నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో అర్హ నటన చూసి అల్లు అర్జున్ దంపతులు మురిసిపోయారట.
శాకుంతలం చిత్రంలో సమంత ప్రధాన పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జోరుగు షూటింగ్ సాగుతున్న ఈ సినిమాలో అర్హ ఒక కీలక పాత్రలో నటిస్తోందని చిత్ర యూనిట్ చెబుతోంది.
అయితే, తమ ముద్దుల కుమార్తె ఎలా నటిస్తుందో చూడాలన్న కుతూహలంలో బన్నీ దంపతులు శాకుంతలం సెట్‌కి వెళ్లగా అక్కడ ఆమె నటన చూసి వారు ఫిదా అయ్యారు.
కుమార్తె నటన చూసి బన్నీ తెగ ఆనంద పడుతున్న ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి.
బన్నీ అభిమానులు వీటిని తెగ షేర్ చేస్తున్నారు.