గతంలో టాలీవుడ్ లో సినిమాలు ఎన్ని ఎక్కువ రోజులు ఆడితే అంత హిట్ అయినట్లు. సినిమా హిట్ అయితే అర్ధ శత దినోత్సవాలు…శత దినోత్సవాలు జరిగేవి. కానీ, కొన్నేళ్లుగా ట్రెండ్ మారింది. శత దినోత్సవాలు పోయి జత దినోత్సవాలు వచ్చాయి. పట్టుమని పది రోజులు…మహా అయితే 20 రోజులు ఆడితే చాలు అనుకునే పరిస్థితి. ప్రస్తుతం సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది అన్నదాన్ని బట్టి హిట్టా ..ఫట్టా అని తేల్చేస్తున్నారు ట్రేడ్ పండితులు.
అయితే, ఇటువంటి సమయంలో కూడా ఓ సినిమా ఇటు అర్ధ శత దినోత్సవాన్ని పూర్తి చేసుకొని…అటు వందల కోట్ల క్లబ్లో చేరడం అంటే మామూలు విషయం కాదు. అటువంటి అనితర సాధ్యమైన రికార్డును సృష్టించింది…దానిని ఇంకోసారి బ్రేక్ చేయబోయేది ఒక్క నందమూరి బాలకృష్ణే అనడంలో ఎటువంటి సందేహం లేదు. బాలయ్య నటించిన అఖండ చిత్రం అఖండి విజయాన్ని అందుకొని నేటితో 50 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది.
నటసింహ నందమూరి బాలకృష్ణ-ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’ అటు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగించింది. ఇప్పటికే 200 క్లబ్ లో చేరిన ఈ చిత్రం…తాజాగా 50 డేస్ క్లబ్ లో చేరి…ఈ రెండు ఘనతలు సాధించిన అరుదైన చిత్రంగా నిలిచింది. దాదాపు అన్ని మెయిన్ ఏరియాల్లోనూ 50 రోజుల పోస్టర్ పడడం మరో ప్రత్యేకత. 103 సెంటర్లలో (షిఫ్టింగ్‌తో కలిపి) ‘అఖండ’ అర్థ శతదినోత్సవం జరుపుకుంటోంది.
దీంతో, హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ సుదర్శన్ థియేటర్‌తో పాటు యూఎస్, యూకె, సిడ్నీ, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ అఖండ 50 డేస్ సెలబ్రేషన్స్ భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. కరోనా కోరల్లో చిక్కుకున్న ఇండస్ట్రీ, థియేటర్లకు కొత్త ఊపిరి పోసిన అఖండ బాలయ్య కెరీర్లో హయ్యస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది. అందుకే, బాలయ్య ఈ రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్లో అఖండ సెకండ్ షో చూడబోతున్నారు.