తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళ ఇండస్ట్రీలో స్టార్డమ్ సంపాదించుకున్న హీరోయిన్లలో ఐశ్వర్య రాజేశ్ ఒకరు. గ్లామర్ షో కన్నా ప్రాధాన్యత ఉన్న పాత్రల వైపు ఎక్కువగా మొగ్గు చూపే ఐశ్వర్య రాజేశ్.. కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇటీవల కాలంలో టాలీవుడ్ లో కూడా బిజీ అవుతోంది. 2019లో విడుదలైన `కౌసల్య కృష్ణమూర్తి` ఐశ్వర్యకు తెలుగులో తొలి చిత్రం. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో.. ఐశ్వర్య తొలి సినిమాతో తెలుగువారికి చేరువైంది.
ఆ తర్వాత మిస్ మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, రిపబ్లిక్ వంటి చిట్రాల్లో మెరిసింది. కానీ ఇవేమి అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. అయితే ఇటీవల విడుదలైన `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ మాత్రం ఐశ్వర్య రాజేశ్ గ్రాఫ్ ను అమాంతం పెంచేతాయి. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ క్రైమ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో వెంకటేశ్ భార్యగా భాగ్యం పాత్రలో ఐశ్వర్య చెలరేగిపోయింది. తనదైన యాక్టింగ్, కామెడీ టైమింగ్ మరియు డ్యాన్సులతో ప్రేక్షకులను అద్భుతంగా ఎంటర్టైన్ చేసింది.
సంక్రాంతి కానుకగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం.. మూడు వారాల్లోనే రూ. 300 కోట్ల క్లబ్ లో చేరి రీజనల్ సినిమాల పరంగా ఆల్టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ మూవీ విజయంతో ఐశ్వర్య రాజేశ్ రేంజ్ తో పాటు రెమ్యునరేషన్ కూడా పెరిగిందని ఇన్సైడ్ జోరుగా ప్రచారం జరుగుతోంది. వెంకీ మూవీ అనంతరం టాలీవుడ్ లో ఐశ్వర్యకు మరిన్ని అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రెమ్యునరేషన్ భారీగా పెంచిందట. సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరకు కోటి రూపాయలు తీసుకున్న ఐశ్వర్య రాజేష్.. ఇకపై చేయబోయే చిత్రాలకు రూ.3 నుండి రూ.4 కోట్ల రేంజ్ లో డిమాండ్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. కాగా, ప్రస్తుతం ఐశ్వర్య తమిళంలో `కరుప్పర్ నగరం`, `మోహన్ దాస్`, `తీయవర్ కులైగల్ నడుంగ` చిత్రాల్లో యాక్ట్ చేస్తోంది. అలాగే కన్నడలో `ఉత్తరకాండ` అనే మూవీకి సైన్ చేసింది.