ప్రభుత్వం గురువారం అధికారికంగా ఎయిర్ ఇండియాను టాటా గ్రూపునకు అప్పగించింది. టాటా గ్రూప్ ఇప్పుడు భారత విమాన రంగపు దిగ్గజంపై పూర్తి హక్కులు సొంతం చేసుకుంది. దీనికి సంబంధించిన ఒప్పందాన్ని ప్రభుత్వం నోటిఫై చేసింది.
నిర్వహణ నియంత్రణతో పాటుగా ఎయిర్ ఇండియా యొక్క 100 శాతం షేర్లను తలాస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు బదిలీ చేయడంతో ఎయిర్ ఇండియా యొక్క వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ లావాదేవీ ఈరోజు విజయవంతంగా ముగిసింది. ఎయిరిండియా పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను విజయవంతంగా ముగించడం జరిగింది అని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు.
మొత్తం రూ.2,700 కోట్లు ప్రభుత్వానికి నేరుగా అందాయి. మేము షేర్లను బదిలీ చేసాము. మిగిలిన మొత్తం రూ. 15,300 కోట్ల రుణం కూడా ఆమోదించబడింది, దానిని విడదల వారిగా టాటా చెల్లింపు చేయడానికి అనుమతిస్తున్నాం. దీంతో ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయి,” అని మంత్రి పేర్కొన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాలో ప్రస్తుతం పనిచేస్తున్న 12,000 మంది ఉద్యోగులను కొనసాగించాల్సి ఉంటుందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సాల్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా సిబ్బందికి స్వాగతం పలుకుతూ టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సందేశం పంపారు. అందులో ఏముందంటే..
“ఇన్ని సంవత్సరాల తర్వాత ఎయిర్ ఇండియాను టాటా కుటుంబంలోకి తిరిగి స్వాగతిస్తున్నందుకు మేము గర్విస్తున్నాము.
ఎయిర్ ఇండియా జ్ఞాపకాలు అద్భుతంగా ఉన్నాయి, ఇపుడు భవిష్యత్తు నిర్మించడానికి ముందుకు చూడాల్సిన సమయం వచ్చింది. ఈ రోజు ఒక కొత్త అధ్యాయానికి నాంది. దేశం మొత్తం కళ్ళు మనపై ఉన్నాయి, మనం కలిసి ఏమి సాధిస్తామో అని దేశం ఎదురు చూస్తుంది. మన దేశానికి అవసరమైన విమానయాన సంస్థను నిర్మించడానికి కుటుంబంగా కలిసి పనిచేయాలి.మా కుటుంబానికి మిమ్మల్ని స్వాగతించడానికి టాటా గ్రూప్ తరపున నేను ఈ లేఖ వ్రాస్తున్నాను‘‘
ఇది సింపుల్ గా సారాంశం.
టాటా గ్రూప్ 1953లో జాతీయం చేయబడింది. ఎయిర్ ఇండియా స్థాపకుడు JRD టాటా 1932లో ఎయిర్‌లైన్‌ను ప్రారంభించినప్పుడు దేశంలో అదే మొదటి విమానం. తొలి ప్రయాణం కరాచీ మరియు బొంబాయి జరిగింది.