గుజరాత్లోని అహ్మదాబాద్ సెషన్స్ కోర్ట్ సంచలన తీర్పునిచ్చింది. ఒకే తీర్పుతో 38మందికి మరణశిక్ష విధించింది స్పెషల్ కోర్టు.
2008లో టెర్రరిస్టులు అహ్మదాబాద్లో 18 చోట్ల వరుసబాంబు పేలుళ్లు జరిపారు. ఆ కేసులో 49 మందిని దోషులుగా తేల్చిన కోర్టు వారిలో 38మందికి మరణశిక్షని విధించింది.
ఇంతమందికి ఒకేసారి ఉరిశిక్ష విధించడం దేశంలో ఇదే తొలిసారి.
13ఏళ్ల పాటు విచారణ కొనసాగిన ఈ కేసులో మరో 11మందికి జీవిత ఖైదుని విధించింది కోర్టు.
ఇంతమందికి ఒకేసారి ఉరి శిక్ష విధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఉరిశిక్షలు, జీవిత ఖైదు పడిన దోషుల్లో కొందరి పేర్లు ఇవీ..
ఇమ్రాన్ షేక్, ఇక్బాల్ షేక్, షంషుద్దీన్ షేక్, యాసుద్దీన్ అన్సారీ, మొహమ్మద్ ఆరిఫ్, మొహమ్మద్ ఉస్మాన్,
యూనస్ మన్సూరీ, సఫ్దార్ హుస్సేన్ నగోరి, హఫీజ్ హుస్సేన్ ముల్లా, మొహమ్మద్ సాజిద్, ముఫ్తీ అబు బషర్,
అబ్బాస్ సమీజా, జావేద్ షేక్, అతికార్ రహమాన్, మెహదీ హసన్, ఉమర్ కబీరా, సలీమ్ సెఫాహి, అఫ్జల్ ఉస్మానీ,
మొహమ్మద్ సాదిఖ్, ఖయాముద్దీన్ కపాడియా, మొహమ్మద్ షేక్, జీషాన్ అహ్మద్, జియా వుల్ రహమాన్,
మొహమ్మద్ షకీల్, మొహమ్మద్ అక్బర్, మొహమ్మద్ నౌషద్, సైఫుర్ రహమాన్, మొహమ్మద్ అన్సర్,
మొహమ్మద్ షకీల్, అమీన్ అలియాస్ రజా, మొహమ్మద్ అబ్రార్
ఇంతకీ ఏమిటీ కేసు
2008లో అహ్మదాబాద్ సిటీలో దుండగులు 18 చోట్ల బాంబులు అమర్చారు.
ఇవి కొన్ని చోట్ల పేలడంతో బాంబు దాడిలో 56 మంది మృతి చెందారు. 200 మందికి గాయాలయ్యాయి.
బాంబులను స్కైవేలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, బస్ స్టేషన్లను టార్గెట్ గా చేసుకుని అమర్చారు.
జనాలు రద్దీ ఉండే ప్రాంతాల్లో బాంబులు అమర్చారు.
అయితే కొన్ని చోట్ల అమర్చిన బాంబులు పేలకుండా బాంబ్ స్క్వాడ్ అధికారులు నిర్వీర్యం చేశారు.
దీంతో పెద్దయెత్తున ప్రాణనష్టం తప్పింది. లేదంటే వేల మంది మరణించేవారు.