అమరావతి రైతుల అరసవిల్లి పాదయాత్ర మొదలయ్యే వరకు ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్టించుకోని వైసీపీ అమరావతి రైతులు పాదయాత్ర మొదలుపెట్టగానే అయ్యో ఉత్తరాంధ్ర ఎంత వెనుకపడిందో, దాని అభివృద్ధి ని అడ్డుకుంటున్నారా అని గగ్గోలు పెడుతున్నారు ’’ఉత్తరాంధ్ర దుష్టత్రయం’’.
ఎవరీ ’’ఉత్తరాంధ్ర దుష్టత్రయం’’ అనుకుంటున్నారా… బొత్స సత్యనారాయణ కుటుంబం, తమ్మినేని సీతారాం కుటుంబం, ధర్మాన కుటుంబం… ఈ మూడు కుటుంబాలు 3 దశాబ్దాలుగా ఉత్తరాంధ్రను పాలిస్తూ మంత్రులుగా ఉంటూ ఉత్తరాంధ్రను వీసమెత్తు కూడా అభివృద్ధి చేయకుండా ’’ఉత్తరాంధ్ర దుష్టత్రయం’’గా మిగిలిపోయారు.
రాయలసీమ నేతలు ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేసినపుడు అది దండయాత్ర అని గుర్తుకు రాలేదా వీళ్లకి అని జనం ప్రశ్నిస్తున్నారు. ఇపుడు పాపం రాష్ట్రం కోసం తమ భూమిలో 75 శాతం ఉచితంగా ఇచ్చేసిన రైతులను పట్టుకుని వారు ఉత్తరాంధ్ర మీద దండయాత్ర చేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు.
వారు శాంతంగా పాదయాత్ర చేసుకుంటూ సూర్యదేవాలయానికి పోతున్నారు. 30 సంవత్సరాలుగా ఉత్తరాంధ్రను కబ్జాచేసిన ముగ్గురు నేతలు తమకు పదవులు వచ్చినా కూడా ఒక్క పరిశ్రమ కూడా తేకుండా ఉత్తరాంధ్రకు అన్యాయం చేశారు. ఈరోజు వారు ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారు.
గతం గురించి పక్కన పెడదాం.. వైసీపీ వచ్చిన 3 సంవత్సరాలలో ఉత్తరాంద్రకు ఏమీ తేకపోగా… అక్కడున్న విశాఖ స్టీలును అమ్మకుండా ఆపలేకపోయారు. రైల్వే జోన్ తేలేకపోయారు. బాబు తెచ్చిన పరిశ్రమలు తరిమేశారు. అప్పట్లో భోగాపురం పరిశ్రమకు అడ్డుపడ్డారు. ఇపుడు మళ్లీ అయ్యో ఉత్తరాంధ్ర అంటూ డ్రామా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అసలు ఉత్తరాంధ్ర దుష్టత్రయం అంటూ బొత్స, తమ్మినేని, ధర్మాన కుటుంబాలను పాపులర్ లాయర్ శ్రవణ్ కుమార్ దుమ్ముదులిపేశారు. అదేంటో ఆయన మాటల్లో వినండి.