స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ ప్రధానమంత్రికి సాధ్యం కాని అపురూప రికార్డును ప్రధాని మోడీ సాధించేశారు.
కొద్ది రాష్ట్రాలు మినహా దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ ను సెంచరీ దాటేసిన ఘనతను మూటగట్టేసుకున్నారు. అన్ని అనుకున్నట్లే జరిగితే మహా అయితే.. రెండు నెలల్లో డీజిల్ ధర కూడా లీటరు వంద దాటేయటం ఖాయమ.
ఆకాశమే హద్దుగా దూసుకెళుతున్న చమురు ధరల వేళ.. మహారాష్ట్రకు చెందిన నేతలు అదిరే ఐడియా వేశారు.
లీటరు వంద రూపాయిలు దాటేయటంతో తెగ ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగేలా మహారాష్ట్రలోని ఒక ప్రెటోల్ బంకులో లీటరురూపాయికే ఇవ్వటంతో జనాలు క్యూ కట్టారు.
కిలో మీటర్ల కొద్దీ బారులు తీరారు. ఇంతకూ ఇంత కారు చౌకగా పెట్రోల్ ఎందుకు ఇచ్చారంటే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కుమారుడు కమ్ రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే పుట్టిన రోజు ఆదివారం జరుపుకున్నారు.
యువనేత పుట్టిన రోజును అందరికి గుర్తుండిపోయేలా డోంబివలీ యువసేన ఠాణేలోని ఒక పెట్రోల్ బంకులో లీటరు పెట్రోల్ రూపాయికే కార్యక్రమాన్ని చేపట్టారు. ముంబయిలోని మరో పెట్రోల్ బంకులో యువ నేత బర్త్ డే సందర్భాన్ని పురస్కరించుకొని లీటరు పెట్రోల్ రూ.50కే పంపిణీ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో తోపుల్లాంటి నేతలు బోలెడంత మంది ఉన్నారు. వారిలో ఏ ఒక్కరికి ఇలాంటి ఐడియాలు ఎందుకు రావు? ఇప్పటికైనా మించిపోయింది లేదు.. ఐడియాను కాపీ కొట్టేస్తే సరి.