• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

sensation: జగన్ … చంద్రబాబును మించిపోయాడట !!

admin by admin
June 14, 2021
in Andhra, Top Stories, Trending
0
0
SHARES
490
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

గ‌తంలో ఉమ్మ‌డి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలోనూ న‌వ్యాంధ్ర తొలి సీఎంగాను వ్య‌వ‌హ‌రించిన టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబుకు ప‌నిరాక్ష‌సుడు అనే పేరు ఉండేది. నేను నిద్రపోను.. మిమ్మ‌ల్ని నిద్ర పోనివ్వ‌ను.. అంటూ ఆయ‌న అధికారుల‌ను ఉరుకులు ప‌రుగులు పెట్టించారు. దీంతో ఉద్యోగ వ‌ర్గాల్లో చంద్ర బాబుపై ఒక‌విధ‌మైన వ్య‌తిరేక‌త పెరిగి.. ఏకంగా పార్టీ అధికారం నుంచి కింద‌కి దిగేందుకు దారి తీసింది.

ఇక‌, ఇప్పుడు వైసీపీ స‌ర్కారు రావ‌డంతో అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వ‌ర‌కు ఊపిరి పీల్చుకుంటున్నార‌ని వైసీపీ నేత‌లు ప్ర‌చారం చేసుకుంటున్నారు. కానీ, వాస్త‌వంలో మాత్రం ఆదిలో ఒకింత ఫ‌ర్వాలేదు.. అనుకున్నా.. రాను రాను.. చంద్ర‌బాబును మించిపోయేలా జ‌గ‌న్ పేరు తెచ్చుకుంటున్నార‌న్న చ‌ర్చ‌లు సొంత పార్టీ నేత‌ల్లోనే వినిపిస్తున్నాయి.

ఇప్పుడు హోం డిపార్ట్ మెంట్ నుంచి అన్ని శాఖ‌ల అధికారులు సిబ్బంది.. ఒత్తిడికి గుర‌వుతున్నార‌నేది వాస్త‌వం. ప్ర‌భుత్వం ఏర్పాటైన కొత్త‌లో పోలీసుల‌కు వీక్లీఆఫ్ ప్ర‌క‌టించిన జ‌గ‌న్ పోలీసుల ద‌గ్గ‌ర మంచి మార్కులు కొట్టేశారు. అయితే.. త‌ర్వాత తీసుకున్న కొన్నినిర్ణ‌యాలు.. ప్ర‌తిప‌క్ష నేత‌ల అరెస్టుల‌తో పోలీసుల‌పై హైకోర్టు సీరియ‌స్ కావ‌డం.. డీజీపీ గౌతం స‌వాంగ్ మూడు సార్లు కోర్టు మెట్లు ఎక్క‌డం వంటి ప‌రిణామాల‌తో ఇప్పుడు పోలీసులు ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు వ‌చ్చినా.. చేసేందుకు హ‌డ‌లి పోతున్నార‌ట‌.

గ‌తంలో చంద్ర‌బాబు హ‌యాంలో ఏనాడూ ఇంత ఒత్తిడి ఎదుర్కొన‌లేద‌ని వారు గుస‌గుస‌లాడుతున్నారు. ఈ ప‌రిణామాల‌తో కొంద‌రు ఉన్న‌త‌స్థాయి అధికారులు ప‌దుల సంఖ్య‌లో సెల‌వుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న విష‌యం తాజాగా వెలుగు చూసింది.

ఇక‌, అత్యంత ప‌ని ఒత్తిడి ఎదుర్కొంటున్న శాఖ రెవెన్యూ. నెల‌లో ఏదో ఒక కొత్త ప‌థ‌కంతో ముందుకు వ‌స్తున్న జ‌గ‌న్‌.. వీటిని అమ‌లు చేసే బాధ్య‌త‌ను రెవెన్యూ అధికారుల‌పైనే పెడుతున్నారు. ఈ క్ర‌మంలో వీరికిచేదోడుగా ఉంటుంద‌ని స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చారు.

దీంతో త‌మ‌పై ఒత్తిడి త‌గ్గుతుంద‌ని రెవెన్యూ అధికారులు భావించినా.. రాను రాను ప‌నిపెరిగిపోయి.. చంద్ర‌బాబును మించిపోయారు సార్‌! అనే వ్యాఖ్య‌లు వినిపించే ప‌రిస్థితి ఏర్ప‌డింది. అదేవిధంగా ఇత‌ర విభాగాల అధికారుల‌కు కూడా రెస్ట్ లేకుండా పోయింద‌నే వాద‌న వినిపిస్తోంది.

ఇక‌, ఉద్యోగ సంఘాలు ఎదురు చూస్తున్న సీపీఎస్‌, పీఆర్సీ, ఈల్స్ వంటి విష‌యాల‌ను జ‌గ‌న్ ప‌ట్టించుకోక‌పోవ‌డం కూడా వారి ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌వుతోంది. అయితే.. ఎవ‌రూ మాత్రం బ‌య‌ట‌కు చెప్ప‌డం లేదు. సంఘాల నేతలు కూడా మౌనంగా ఉంటున్నారు. ఈ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తున్న ప‌రిశీల‌కులు.. ఇదే విధానం ఎన్నిక‌ల వ‌ర‌కు కొన‌సాగితే.. మంచిదికాద‌ని సూచిస్తున్నారు. గ‌తంలో బాబుకు ఎదురైన అనుభవం జ‌గ‌న్‌కు ఎదురైనా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు. మ‌రి జ‌గ‌న్ మార‌తారా?  ఉద్యోగుల‌పై ఒత్తిడి త‌గ్గిస్తారా? అనేది వేచి చూడాలి.

Tags: andhrapradeshChandrababuJagan
Previous Post

జగన్ ను సాక్ష్యాలతో ఇరికించేసిన RRR

Next Post

ఆ బంకు స్పెషల్ – లీటరు పెట్రోలు 1 రూపాయికే

Related Posts

Andhra

లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు

May 14, 2025
Movies

విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?

May 14, 2025
Andhra

కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!

May 14, 2025
Andhra

వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!

May 14, 2025
Andhra

వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!

May 14, 2025
India

చావు కబురు చల్లగా చెప్పిన పాక్

May 13, 2025
Load More
Next Post

ఆ బంకు స్పెషల్ - లీటరు పెట్రోలు 1 రూపాయికే

Please login to join discussion

Latest News

  • లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు
  • విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?
  • కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!
  • వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!
  • వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!
  • చావు కబురు చల్లగా చెప్పిన పాక్
  • ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?
  • ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క మ‌లుపు.. మ‌రో వ్య‌క్తి అరెస్ట్..!
  • టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?
  • కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?
  • మే 17న ఐపీఎల్‌ పునఃప్రారంభం.. ఫైన‌ల్ మ్యాచ్ ఆ రోజే..!
  • పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్
  • తిరుమలకు వెళ్తున్నారా? ఈ విలువైన సమాచారం మీ కోసమే!
  • యుద్ధం అంటే.. సినిమా అనుకున్నారా?: ఆర్మీ మాజీ చీఫ్‌ ఫైర్‌
  • ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra