గత ఏడాది ‘ఆదిపురుష్’ సినిమా టీజర్ రిలీజైనపుడు జరిగిన రచ్చ గురించి సినీ ప్రియులందరికీ తెలిసిందే. బహుశా ఒక సినిమా టీజర్ మీద ఆ స్థాయిలో వ్యతిరేకత రావడం, అంతగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగడం ఇంతకుముందెప్పుడూ జరిగి ఉండదేమో. దెబ్బకు సినిమాను వాయిదా వేసుకుని.. విజువల్ ఎఫెక్ట్స్ సహా పలు అంశాలపై మళ్లీ వర్క్ చేయడం మొదలుపెట్టింది టీం.
ఆ పనంతా పూర్తి చేసి.. సినిమాను మెరుగ్గా తీర్చిదిద్దినట్లుగా భావిస్తున్
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, భాజపా నేత శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం ట్రైలర్ను వీక్షించడం, ఈ సినిమాకు మద్దతు పలకడం విశేషం. ఇంకా పలువురు భాజపా, హిందూ ప్రో నేతలు ట్రైలర్ చూసి కొనియాడుతున్నారు. ఇంతకుముందు వచ్చిన టీజర్ చూసి విమర్శలు గుప్పించిన నాయకుల్ని కూడా చిత్ర బృందం కలిసి మద్దతు సంపాదిస్తుండటం విశేషం.
రామాయణం మీద సినిమా అంటే హిందూ సంస్కృతికి ప్రతీకగా భావిస్తారు అందరూ. ఇలాంటి సినిమాలను బీజేపీ వాళ్లు నెత్తికెత్తుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఇది ఒక రకంగా చిత్ర బృందానికి సానుకూల సంకేతాన్ని ఇచ్చేదే. భాజపా వాళ్లు ఫండింగ్ చేసి మరీ కొన్ని చిత్రాలకు వెనుక ఉండి వాటి రీచ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ‘కశ్మీర్ ఫైల్స్’ లాంటి సినిమాలకు ఇది బాగా లాభించింది.
ఐతే బీజేపీ వాళ్లు మరీ ఎక్కువగా సినిమాను ఎత్తుకుంటే.. ‘ఆదిపురుష్’పై ఒక ప్రాపగండా ఫిలింగా ముద్ర పడ్డా ఆశ్చర్యం లేదు. రామాయణం పట్ల వ్యతిరేకత లేకపోయినా.. బీజేపీ దీన్ని సపోర్ట్ చేయడం వల్ల కొన్ని వర్గాలు సినిమా పట్ల వ్యతిరేకత పెంచుకోవచ్చు. మరి ఈ పరిణామం మంచి చేస్తుందో చెడు చేస్తుందో చూడాలి.