ఇటీవల పెను సంచలనం రేపిన బెంగళూరు డ్రగ్స్ అండ్ రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్ అవ్వడం.. ఆ తర్వాత బెయిల్ పై బయటకు రావడం మనందరికీ తెలిసిందే. ఈ ఇష్యూ వల్ల హేమ పేరు ఇటు తెలుగుతో పాటు అటు కన్నడ మీడియాలోనూ మారుమోగిపోయింది. అప్పటి నుంచి మీడియాకు కొంచెం దూరంగా ఉంటున్న హేమ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
ఈ సందర్భంగా తనపై వచ్చిన ఆరోపణలు హేమ కొట్టి పారేసింది. తాను డ్రగ్స్ తీసుకోలేదని.. బర్త్ డే పార్టీ కి వెళ్తే.. రేవ్ పార్టీకి వెళ్లానంటూ మీడియా కథనాలు రాసిందని హేమ చెప్పుకొచ్చింది. తాను ఏ తప్పు చేయలేదని నాలుగు కన్నాళ్లు కార్చింది. మరి పోలీసులు ఎందుకు అరెస్టు చేశారు? వైద్య పరీక్షల్లో డ్రగ్స్ తీసుకున్నట్లు ఎందుకు వచ్చింది? అని ప్రశ్నిస్తే మాత్రం.. హేమ సమాధానం దాటవేసింది.
ఇక ఇదే ఇంటర్వ్యూలో హేమ `జై జనసేన.. జై కాపు.. జై జై కాపు` అంటూ కొత్త రాగం అందుకుంది. ఎలక్షన్ రిజల్ట్ టైంలోనే రేవ్ పార్టీ కేసులో ఇరుక్కోవడం వల్ల పవన్ కళ్యాణ్ గెలుపు ఎంజాయ్ చేయలేకపోయానని హేమ తెలిపింది. `నేను పక్కా కాపుని. పవన్ గారు గెలిచారంటే ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. కానీ కుదర్లేదు. జై జనసేన అని అరవాలి.. జై కాపు.. కాపుల ఐకమత్యం వర్ధిల్లాలి` అంటూ హేమ చెప్పుకొచ్చింది.
కాగా, గతంలో ఒకానొక సందర్భంలో మీడియా వారు జనసేనలోకి వెళ్తారా? అని ప్రశ్నిస్తే.. హేమ వారిపై విరుచుకుపడింది. జనసేనలో ఎందుకు చేరాలి? పవన్ కళ్యాణ్ హీరో అయినంత మాత్రాన ఆయన పార్టీలో చేరాలా? అంటూ మండిపడింది. ఆ తర్వాత 2019లో జగన్ సమక్షంలో హేమ వైసీపీలో చేరింది. కానీ ఇప్పుడు ఏపీలో పవన్ డిప్యూటీ సీఎంగా చక్రం తిప్పుతుండటంతో.. జై జనసేన.. జై కాపు అంటూ హేమ పార్టీ మార్చేసింది. దీంతో ఆమె తీరు పట్ల నెటిజన్లు విమర్శులు కురిపిస్తున్నారు. ఊసరవెల్లి కూడా ఇన్ని రంగులు మార్చదేమో అంటూ హైమపై సెటైర్లు పేలుస్తున్నారు.