ఇటీవల సినీ పరిశ్రమలో ఓవైపు సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలెక్కుతుంటే.. మరోవైపు సెలబ్రిటీ కపుల్స్ వరుసగా విడాకులు తీసుకుంటూ వార్తల్లో సెన్సేషన్ అవుతున్నారు. కొద్ది నెలల క్రితం ధనుష్, ఐశ్వర్య విడిపోయారు. ఆ తర్వాత ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ యాక్టర్ జీవీ ప్రకాష్ తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఇక తాజాగా తమిళ స్టార్ హీరో జయం రవి సైతం విడాకుల బాటలోనే నడిచాడు. భార్య ఆర్తితో విడిపోతున్నట్లు జయం రవి అఫీషియల్ గా ప్రకటించారు.
చాలా రోజుల నుంచి వీరి మధ్య సఖ్యత లేదని.. రవి-ఆర్తి విడాకులు తీసుకోబోతున్నారని కోలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు ఆ వార్తలనే నిజం చేస్తూ సోషల్ మీడియా ద్వారా జయం రవి సంచలన ప్రకటన చేశాడు. ఇష్టపూర్వకంగానే తాము విడాకులు తీసుకుంటున్నట్లు రవి వెల్లడించాడు. `జీవితం ఎన్నో అధ్యయనాలతో నిండిన ప్రయాణం. ఈ ప్రయాణంలో అనేక సవాళ్లను ఎదుర్కోవాలి. మీలో ఎంతోమంది నన్ను ఆదరించి నాకు సపోర్ట్ గా నిలబడ్డారు.
అందుకే నేనెప్పుడూ మీతో నిజాయితీగా ఉంటాను. ఈరోజు భారమైన హృదయంతో నా వ్యక్తిగత విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఎన్నో చర్చల తర్వాత నేను, నా భార్య ఆర్తి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాము. ఇది మా ఇద్దరి మంచి కోసం తీసుకున్న నిర్ణయం. మాతో పాటు మా కుటుంబ సభ్యుల గోప్యతను గౌరవించాలని మీ అందరిని కోరుతున్నాను. ఈ విషయంపై ఎటువంటి రూమర్స్ సృష్టించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది పూర్తిగా మా వ్యక్తగత విషయం` అంటూ రవి పోస్ట్ పెట్టి అభిమానుల హార్ట్‌బ్రేక్ చేశాడు.
కాగా, ఎడిటర్ మోహన్ కుమారుడైన రవి.. జయం మూవీతో హీరోగా కోలీవుడ్లోకి అడుగుపెట్టారు. తొలి సినిమాతోనే హిట్ అందుకుని జయం రవిగా ప్రసిద్ధి చెందాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ తమిళ ఇండస్ట్రీలో భారీ స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు. పొన్నియన్ సెల్వన్ సినిమాతో నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్నాడు. ఇక 2009లో ప్రముఖ టెలివిజన్ నిర్మాత సుజాత విజయ్ కుమార్ కుమార్తె అయిన ఆర్తిని రవి వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఆరవ్, అయాన్ అనే కుమారులు ఉన్నారు.
Grateful for your love and understanding.
Jayam Ravi pic.twitter.com/FNRGf6OOo8
— Jayam Ravi (@actor_jayamravi) September 9, 2024