టాలీవుడ్ లో ప్రతినాయక పాత్రలకు సంబంధించిన సుపరిచితమైన పేరు ఎవరిదైనా ఉందంటే అది అజయ్. పెద్ద ఎత్తున సినిమాల్లో నటించిన అజయ్.. ప్రతినాయకుడి పాత్రకు పర్ ఫెక్టుగా సూట్ అవుతారు.
ఒక్కడు.. విక్రమార్కుడు.. దేశ ముదురు.. ఛత్రపతి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో విలనిజాన్ని ప్రదర్శించిన ఇతగాడి ప్రత్యేకత ఏమంటే.. మాటలోనే విలనీ చూపించటం. ప్రతినాయకుడి ఛాయలున్న ఏ పాత్రకైనా ఇట్టే సూట్ అయ్యే అజయ్.. నటుడిగా ఫుల్ బిజీ.
మిగిలిన సెలబ్రిటీలకు భిన్నంగా.. ఆయన తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాల్ని పెద్దగా పంచుకోరు. అలాంటి అజయ్ తాజాగా తనకు సంబంధించి తెలీని ఎన్నో విషయాల్ని ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు.అంతేకాదు.. తన వైఫ్ ను పరిచయం చేయిన అజయ్.. తాజాగా ఆమెకు సంబంధించిన విషయాల్ని మాత్రమే కాదు.. తమకు జరిగిన పెళ్లి గురించి వెల్లడించారు.
ఆమేం చేస్తుంటారో చెప్పటమే కాదు.. తమ పిల్లలకు చెందిన గ్రూప్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. రీల్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో రియల్ ఘటనలు అజయ్ జీవితంలో బోలెడు కనిపిస్తాయి.
సినిమాల విషయంలోనే కాదు వ్యక్తిగత జీవితంలోనూ తాను చాలా తప్పులు చేశానని ఒప్పుకునే ధైర్యం అతగాడి సొంతం. టీనేజ్ లో తాను చేసిన ఒక తప్పు గురించి చెబుతూ.. తన ఫ్రెండ్ ను తీసుకొని పందొమ్మిదేళ్ల వయసులో నేపాల్ పారిపోయానని.. అక్కడ మూడు నెలలు సరదాగా గడిపినట్లు చెప్పాడు.
ఆ తర్వాత తిరిగి రావటానికి డబ్బులు లేకపోవటంతో ఒక హోటల్లో పని చేసినట్లు చెప్పాడు. అక్కడే గిన్నెలు కడగటం చేసేవాడినని.. డబ్బులు కూడబెట్టుకున్న తర్వాత మళ్లీ వెనక్కి వచ్చేసినట్లు చెప్పాడు.
కాలేజీ టైంలో శ్వేత రావురిని ప్రేమించిన అజయ్.. సీక్రెట్ గా ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నాడు. సెటిల్ అయ్యాక ఇంట్లో వాళ్లకు తమ పెళ్లి గురించి వివరించి.. వారిని ఒప్పించి మరోసారి పెళ్లి చేసుకోవటం విశేషం. ప్రస్తుతం ఆమె పలు ఈవెంట్స్ ను పార్టిసిపేట్ చేస్తూ యాక్టివగా ఉంటారు.
ప్రస్తుతం ఈ జంటకు ఒక కుమార్తె.. కుమారుడు. 2018లో మిస్టర్ అండ్ మిస్టర్స్ సౌత్ ఇండియా అంబాసిడర్ గా వ్యవహరించారు. సినిమా కార్యక్రమాలకు కానీ ఈవెంట్స్ కు కానీ ఒక్కడిగానే రావటంతో అజయ్ ఫ్యామిలీ గురించి పెద్దగా వివరాలు బయటకు రావు. ఆ కొరత తీరుస్తూ ఈ మధ్యన సోషల్ మీడియాలో తన కుటుంబానికి సంబంధించిన ఫోటోల్ని షేర్ చేయటంతో అవిప్పుడు వైరల్ గా మారాయి.