• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

పెద్దల సభకు ఆ వివాదాస్పద క్రికెటర్ ?

admin by admin
March 17, 2022
in India, Politics, Top Stories
0
0
SHARES
235
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ గురించి పరిచయం అక్కర లేదు. భారత్ తరఫున సుదీర్ఘ కాలం రాణించిన క్వాలిటీ స్పిన్నర్లలో భజ్జీ కూడా ఒకరు. మైదానంలో గింగరాలు తిరిగే బంతులు విసిరి ప్రత్యర్థి బ్యాట్స్ మన్ ను కట్టడి చేసే హర్భజన్ కు టర్బోనేటర్ అని పేరుంది. తన ఆటతీరుతో పాటు మాటతీరు, చేతలతోనూ హర్భజన్ పేరు వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తుండేది. ప్రత్యర్థి ఆటగాళ్లతోనే కాదు సొంత జట్టులోని ఆటగాళ్లతోనూ భజ్జీ తీరు వివాదాలకు దారి తీసింది.

ఆసీస్ మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ తో మంకీ గేట్ వివాదం, ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మైదానంలో ప్రేక్షకులందరి ముందు లైవ్ లో మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ను చెంపదెబ్బ కొట్టడం వంటి వ్యవహారాల్లో హర్భజన్ తీరు వివాదాస్పదమైంది. ఇక, పాక్ క్రికెటర్ లతో భజ్జీ పలు మార్లు ట్వీట్ వార్ చేసి వార్తల్లో నిలిచాడు. అటువంటి హర్భజన్ ను ఆప్ తరఫున రాజ్య సభకు పంపాలని అనుకుంటున్నారన్న వార్త ఇపుడు చర్చనీయాంశమైంది.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇపుడు రాజ్య సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. పంజాబ్ లోని 117 అసెంబ్లీ స్థానాలకు గాను 92 స్థానాలను దక్కించుకున్న ఆప్ కు 5 రాజ్యసభ స్థానాలు దక్కాయి. దీంతో, ఆ ఐదుగురిలో ఒకరిగా హర్భజన్ సింగ్‌ ను ఆప్ తరఫున రాజ్యసభకు పంపాలని కేజ్రీవాల్, పంజాబ్ సీఎం  భగవంత్ మాన్ అనుకుంటున్నారట.

పంజాబ్ కు సేవ చేయాలనుందని గతంలో వెల్లడించిన హర్భజన్ ను 2019 లోక్ సభ ఎన్నికలలో అమృత్‌సర్ లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దించాలని బీజేపీ ప్రయత్నించి విఫలమైంది. కానీ, తాజాగా ఆప్ తరఫున పెద్దల సభకు వెళ్లేందుకు మాత్రం ఈ వివాదాస్పద క్రికెటర్ సిద్ధంగా ఉన్నాడట. దీంతోపాటు, జలంధర్‌లో కొత్తగా ఏర్పాటు చేయబోతోన్న స్పోర్ట్స్ యూనివర్సిటీ బాధ్యతలను కూడా భజ్జీకే అప్పగించాలని భగవంత్ సింగ్ అనుకుంటున్నారట. ఈ క్రమంలో ఆప్ తరఫున భజ్జీ పెద్దల సభకు వెళతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు, పంజాబ్ నుంచి ఎన్నికైన ఐదుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్‌లో ముగియనుండగా…తాజాగా ఆ ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలైంది. నామినేషన్లు దాఖలు చేయడానికి మార్చి 21 చివరి తేదీ. మార్చి 31న పోలింగ్‌, కౌంటింగ్‌, ఫలితాలు వెల్లడించనున్నారు.

Tags: aap victory in punjabcm kejriwalex cricketer harbhajan singhharbhajan to rajyasabhapunjab cm bhagavanth mann
Previous Post

చెత్త పన్నుపై ప్రశ్నిస్తే ‘చెత్త’ పోయిస్తావా జగన్?…ట్రోలింగ్

Next Post

చేతులు కాలాక‌.. ఆకులు పట్టుకుంటి సోనియమ్మ?

Related Posts

Andhra

ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!

May 17, 2025
Around The World

భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!

May 17, 2025
Andhra

ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు

May 17, 2025
Politics

కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!

May 17, 2025
Andhra

మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు

May 17, 2025
Movies

స‌మంత‌-రాజ్ రిలేష‌న్ క‌న్ఫార్మ్ చేసిన ప్ర‌ముఖ తెలుగు న‌టి..!

May 17, 2025
Load More
Next Post

చేతులు కాలాక‌.. ఆకులు పట్టుకుంటి సోనియమ్మ?

Please login to join discussion

Latest News

  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
  • మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు
  • అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!
  • స‌మంత‌-రాజ్ రిలేష‌న్ క‌న్ఫార్మ్ చేసిన ప్ర‌ముఖ తెలుగు న‌టి..!
  • కొండా సురేఖ కామెంట్స్..కేటీఆర్ కాంప్లిమెంట్స్
  • ఫ్యాక్ట్ చెక్‌.. చంద్ర‌బాబు-లోకేష్ కోసం రూ. 176 కోట్ల‌తో హెలికాప్ట‌ర్ నిజ‌మేనా?
  • పాక్ అణుకేంద్రాలపై కీలక అప్డేట్
  • లిక్క‌ర్ బ్రాండ్‌కి బాల‌య్య ప్ర‌మోష‌న్‌.. నెటిజ‌న్లు ఫైర్‌..!
  • నాజూకు న‌డుముతో న‌భా క్రేజీ పోజులు.. ప‌ట్టించుకునే వారేరి..?
  • ఆ స్టార్ హీరోకు విల‌న్‌గా రాజ‌శేఖ‌ర్.. కేక పెట్టిస్తున్న కాంబినేష‌న్‌..!
  • వీడ‌నంటున్న క‌ష్టాలు.. బెయిల్ వ‌చ్చినా వంశీ జైల్లోనేనా?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra