సాధారణ ప్రజలకు బార్ కౌన్సిల్ అంటే కొంతకాలం క్రితం వరకు అసలు మీనింగ్ తెలియదు. లాయర్లు అందరికీ అదొక క్లబ్ లాంటిదేమో అనుకునేవాళ్లు కూడా లేకపోలేదు.
అయితే ఇటీవల వకీల్ సాబ్ సినిమా చూశాక అందులో వాదులాడుకునే ఇద్దరు న్యాయవాదులు (ప్రకాష్ రాజ్-పవన్ కళ్యాణ్) బార్ కౌన్సిల్ ముందుకు వెళ్లడం బార్ కౌన్సిల్ వారిని హెచ్చరించడం వంటి సీన్లతో బార్ కౌన్సిల్ అంటే ఒక ఐడియా వచ్చింది జనాలకు.
ఇదంతా ఇపుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే… రఘురామరాజు విషయంలో ఏఏజీ సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి వ్యవహరించిన తీరు వివాదాస్పదం అయ్యింది. కోర్టును బెదిరించే స్వరంతో మాట్లాడారని హైకోర్టు అతనికి చీవాట్లు పెట్టింది. ఓవర్ చేస్తే ‘‘బార్ కౌన్సిల్‘‘ కి రెఫర్ చేస్తామని హెచ్చరించింది.
నిర్భయత్వానికి, అహంకారానికి తేడా తెలుసుకోవాలని వార్నింగ్ ఇచ్చింది. ఎవరి ప్రయోజనాల కోసమో కోర్టుకు ఉద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించింది.
అది సరే…. ఇంతకీ ప్రభుత్వ పెద్దలకు కోర్టుకు మధ్య సమాన దూరం పాటించాల్సిన ఈ ఏఏజీ ఎందుకు ప్రభుత్వ పెద్దల మనసు గెలవడానికి తాపత్రయపడుతున్నారు. ఎవరీయన. ఆ పోస్టులోకి ఎపుడు వచ్చాడు? ఎలా వచ్చాడు? ఈ వీడియోలో చూద్దాం.