గ్లామర్ రంగంలో ఉన్నంత మాత్రాన అందరూ ఒకేలా ఉంటారనుకోవటం తప్పే అవుతుంది. సినిమాల్లో నటించే నటీమణులు పలువురు సోషల్ మీడియాలో రెచ్చిపోవటం.. ప్రైవేటు ఫోటోల్ని.. వీడియోల్ని సైతం పెట్టేయటం.. తమను ఫాలో అయ్యే వారిలో హీట్ పుట్టించేసే తీరుకు కొదవ లేదు.
అందుకు భిన్నంగా పద్దతిగా సినిమాలు చేసుకుంటూ.. గ్లామర్ కంటే కూడా గ్రామర్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే హీరోయిన్లు ఉన్నారు. ఆ కోవలోకే వస్తారు మలయాళ నటి సాధికా వేణుగోపాల్. ఆమెకు మంచి నటి అన్న ఇమేజ్ ఉంది. గ్లామర్ ఒలకపోయటానికి పెద్దగా ఇష్టపడని ఈ భామకు తాజాగా ఊహించని షాక్ తగిలింది.
ఆమెకు బాగా తెలిసిన వ్యక్తి ఒకరు ఇన్ స్టాను చెక్ చేస్తుండగా.. ఒక ఖాతాలో సాధికా వేణుగోపాల్ న్యూడ్ పిక్స్ కంటపడ్డాయి. ఆశ్చర్యానికి గురైన ఆయన వెంటనే సాధికకు ఫోన్ చేసి విషయం చెప్పటమే కాదు.. ఆమెకు ఆ న్యూడ్ పిక్స్ ఉన్న లింకును షేర్ చేశారు. ఆ ఫోటోల్ని చూసిన ఆమెకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది.
తన పేరు మీద అకౌంట్ ను తెరవటమే కాదు.. మార్ఫింగ్ చేసిన న్యూడ్ పిక్స్ ను పోస్టు చేసినట్లుగా గుర్తించింది. వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రంగంలోకి దిగిన పోలీసులు.. చివరకు ఆమె న్యూడ్ పిక్స్ తో దొంగ ఖాతా తెరిచిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. అయితే.. అతడి వివరాలు బయటపెట్టొద్దని.. ఈ కేసులో అతడి పేరు బయటకువస్తే.. అతడి కెరీర్ దెబ్బతింటుందన్న ఉద్దేశంతో తాను తన కంప్లైంట్ ను వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు.
అంతేకాదు.. సరైన సమయంలో పోలీసులు తనకు చేసిన సాయం గురించి చెబుతూ.. థ్యాంక్సుల మీద థ్యాంకుల్సి చెప్పేస్తోంది. తనకు అపకారం చేసినోడ్ని సైతం క్షమించిన ఆమె పెద్ద మనసుకు ఫిదా కావాల్సిందే.
https://www.instagram.com/tv/CSMPbhSpyk8/?utm_source=ig_embed&ig_rid=37604602-bd6b-4101-9c05-a823c8e0e4ed